ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న ప్రాణాంతకమైన కరోనా వైరస్ భారత్ లోకి  కూడా ప్రవేశించి వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. భారతదేశంలో క్రమక్రమంగా కరోనా  పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా  విజృంభన మాత్రం ఆగడం లేదు. ఇక ఇప్పటి వరకు గత మూడు నెలల నుంచి ఈ వైరస్ కు విరుగుడు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరుపుతున్నప్పటికీ... ఏది ఫలితాన్ని ఇవ్వడం లేదు. దీంతో కరోనా ఎఫెక్ట్ తో రోజురోజుకు ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఇక భారత దేశంలో కూడా రోజురోజుకు కరోనా  వ్యాప్తి పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన కఠిన నిబంధనలను అమలు లోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక దేశాలు కరోనా వైరస్ ను అంటువ్యాధిగా ప్రకటించాయి. 

 

 

 ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా కరోనా వైరస్ ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. భారతదేశంలో ఈ వైరస్ ను  నియంత్రించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా  వైరస్ నివారణ చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే మీడియా కు అందిన సమాచారం ప్రకారం... దేశంలో కరోనా వైరస్ నుంచి తప్పించుకునేందుకు... రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి... గోమూత్రం తీసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారట జనాలు. దీంతో గోమూత్రాన్ని ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. గోమూత్రం తీసుకోవడం ద్వారా బాడీలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని తద్వారా కరోనా వైరస్  ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడుతాయని అనుకుంటున్నారట. 

 

 

 ఈ నేపథ్యంలో ఏకంగా గోమూత్రాన్ని 500 రూపాయలకు... ఆవుపేడను 500 రూపాయలకు విక్రయించేందుకు కూడా వెనకాడడం లేదట. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఓ  పాల వ్యాపారి మభూద్ అలీ... ఒకప్పుడు పాలను  విక్రయిస్తే ఎక్కువ డబ్బులు వచ్చేవి కానీ ఇప్పుడు పాలు  విక్రయించిన దానికంటే ఆవు పేడ ఆవు మూత్రం ఎక్కువ ఆదాయం వస్తుంది అంటూ తెలిపాడు. లీడర్ గోమూత్రం ₹500 ఆవుపేడ 500కు విక్రయిస్తున్నట్లు తెలిపాడు. తన దుకాణంలో ఆవు పేడ ఆవు మూత్రం కలిగిన జాడీ లను కూడా ఏర్పాటు చేశాడు. ఇక ఆ దుకాణం ముందు ఒక పోస్టర్ ను కూడా ఏర్పాటు చేశాడు. ఆవు మూత్రం తాగండి కరుణ వైరస్ ను నివారించండి అంటూ ఓ పోస్టర్ ను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన హిందూ మహాసభ కు హాజరైన తర్వాత తనకు ఈ ఆలోచన తట్టింది అంటూ చెప్పుకొచ్చాడు ఆ పాల వ్యాపారి.

మరింత సమాచారం తెలుసుకోండి: