ప్రపంచమంతా కరోనా వైరస్ పాతుకు  పోతుంది.  ఏ దేశాన్ని వదలకుండా ఎంతో మందిని బలి తీసుకుంటుంది ఈ మహమ్మారి వైరస్. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ ప్రపంచ మహమ్మారి.. ప్రస్తుతం పుట్టింటిలో తగ్గినప్పటికీ ప్రపంచ దేశాల్లో దేశాల్లో మాత్రం విలయ తాండవం చేస్తుంది. దీంతో ప్రపంచం మొత్తం కరోనా  భయంతోనే బతుకును వెల్లడిస్తుంది. ప్రపంచ దేశాల ప్రజలకు కంటికి కనిపించని మహమ్మారి వైరస్ కంటికి కునుకు లేకుండా చేస్తుంది. అందరూ ఎక్కడ తమపై కరోనా  వైరస్ ప్రభావం పడుతుందొననని ప్రాణభయంతో నే బతుకును వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నింటికీ ఈ వైరస్ పాకిపోయింది. 

 

 

 ఇక రోజు రోజుకు కొన్ని దేశాల్లో అయితే పరిస్థితి చేయి దాటి పోతుంది. ఇప్పటికే ఎంతో మందిని పొట్టనబెట్టుకున్న ఈ మహమ్మారి  కొన్ని దేశాల్లో  మరణ మృదంగం మోగిస్తూ ఎంతోమందిని కాటికీ పంపిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలు సైతం కరోనా  వైరస్ ను  ఎదిరించలేక చేతులెత్తేస్తున్నారు. ప్రపంచం మొత్తం నిర్బంధంలోకి వెళ్ళిపోయి కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తోంది. ఇప్పటివరకు దాదాపుగా అన్ని దేశాలు ఈ మహమ్మారి వైరస్ బారిన పడి విలవిలలాడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ముందుగా ఈ మహమ్మారిని లైట్ తీసుకున్న ప్రస్తుతం కట్టడి చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడింది. 

 

 

 ఇప్పటికే వందల దేశాలకు వ్యాప్తి చెందింది ఈ మహమ్మారి వైరస్ ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. కానీ కొన్ని దేశాలు మాత్రం ముందస్తు జాగ్రత్తల వల్ల  ప్రస్తుతం సేఫ్ జోన్ లో ఉన్నాయి. ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసులు కూడా నమోదు కాని దేశాలు 9 ఉన్నాయి. కరోనా  వైరస్ ప్రబలుతున్న మొదటి దశలోనే కరోనా  వైరస్ రాకుండా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రస్తుతం కాస్త ఉపశమనాన్ని పొందుతున్నాయి ఈ  దేశాలు. ఇక కరోనా  వైరస్ ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా సోకని దేశాలు తజకిస్తాన్ . ఇప్పుడు వరకు ఇక్కడ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాకుండా లేసోతో  దేశంలో కూడా ఒక కరోనా  పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. కొమొరోస్, సౌత్ సుడాన్, యెమెన్ , బురుండి , మాలావి , నార్త్ కొరియా,  లాంటి దేశాల్లో  ఒక్కరు కూడా ఈ మహమ్మారి వైరస్ బారిన పడలేదు. ప్రస్తుతం ఈ దేశాలు సేఫ్ జోన్ లో కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: