అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అప్పుడప్పుడు తిక్కతిక్కగా ప్రవర్తించినా.. దానికో లెక్క ఉందనేలా ప్రవర్తిస్తుంటారు. ఒక్కోసారి ఎవరి మాటా వినని ట్రంప్ కొన్ని విషయాల్లో మనసున్న మనిషి అని నిరూపించుకుంటున్నాడు. కరోనా వైరస్ ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టిస్తుండటంతో.. మానవత్వాన్ని చాటుకున్నాడు. హెచ్ 1 బి వీసాదారులకు తీపి కబురు అందించి ప్రవాస భారతీయుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. 

 

గతంలో హెచ్ 1 బీ వీసాదారులపై పలు రకాల ఆంక్షలు విధించిన అగ్రరాజ్యం.. ప్రస్తుతం ఆ ఆంక్షలను సడలించి పెద్ద మనసు చాటుకుంది. గ్రీన్ కార్డు, హెచ్ 1బీ వీసాదారులు రెండు నెలల పాటు సమయం పొడిగిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆపత్కాలంలో ట్రంప్ ప్రభుత్వం ఇచ్చిన కొత్త ఆదేశాలు హెచ్ 1బీ వీసాదారులకు ఊపిరి పీల్చుకునేలా చేశాయి. 

 

అగ్రరాజ్యంలో కరోనా ప్రతాపం చూపిస్తుండటంతో ఇమిగ్రేషన్ కార్యాలయాలు పూర్తిగా మూతపడ్డాయి. హెచ్ 1బీ వీసాదారులు ట్రంప్ ప్రభుత్వానికి సమర్పించాల్సిన ఫార్మాలటీస్ నిలిచిపోయాయి. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకున్న ట్రంప్ ప్రభుత్వం హెచ్ 1బీ వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. సంబంధిత పత్రాలు సమర్పించేందుకు 60రోజుల పాటు గడువు ఇచ్చింది. తమ దేశంలో పనిచేస్తూ.. కరోనా వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారిని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపింది అగ్రరాజ్యం. కరోనా ఎఫెక్ట్ తో ఇప్పటికే అమెరికాలో పలు కంపెనీలకు తాత్కాలికంగా తాళాలు వేశారు. దీంతో జూన్ నాటికి రెండు లక్షలకు పైగా ఉద్యోగులు చట్టబద్దమైను హోదాను కోల్పోయే ప్రమాదముంది. అగ్రరాజ్యంలో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న విదేశీయుల సంఖ్య దాదాపు 2.5లక్షల మంది ఉన్నారు. అందులే హెచ్ 1బీ వీసాదారులు 2లక్షల మంది ఉండటం విశేషం. 


అక్కడి రూల్ ప్రకారం.. హెచ్ 1బీ వీసాదారులు శాలరీస్ తీసుకోకుండా అమెరికాలో ఎక్కువ రోజులు ఉండకూడదు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకుంటే.. 60రోజుల్లో కొత్త ఉద్యోగంలో చేరాలి. లేకపోతే వేరే వీసా విభాగంలోకి మారాలి. ఇవేవీ కుదరకపోతే స్వదేశానికి తిరుగు ప్రయాణమవ్వాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: