ఏదైనా తప్పు చేసి  పోలీసులకు చిక్కామే  అనుకోండి ఇక వారి పని అయిపోయినట్టే. ఎందుకంటే పోలీసులు ఇచ్చే ట్రీట్మెంట్ కి జాయింట్లు జారిపోతాయి ఫిలమెంట్లు  రాలిపోతాయి.. ఆ రెంజ్ లో ఉంటుంది మరి పోలీసుల ట్రీట్మెంట్. ఒకసారి ఏదైనా తప్పు చేసి పోలీస్ స్టేషన్కు వెళితే పోలీస్ పవర్ ఏంటో చూపిస్తూ ఉంటారు. అందుకే పోలీసులంటే తెగ భయపడిపోతుంటారు జనాలు. కానీ ఇక్కడ ఓ పోలీస్ స్టేషన్ లో మాత్రం ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్లో ఓ యువకుడు ఉన్నాడు. ఆ యువకుడు  తప్పు చేసి పోలీస్ స్టేషన్కు వచ్చాడా లేదా ఇంకేదైనా కారణం ఉందా అనేది తెలియదు కానీ... ఆ యువకుడితో తెగ డాన్సులు చేయిస్తున్నారు పోలీసులు. అది చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 

 


ఇలాంటి ఘటనలు చాలా మటుకు సినిమాల్లో చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో ఇలా పోలీస్ స్టేషన్ లో డాన్సులు చేయించిన  ఘటన ఇదే మొదటిసారేమో మరి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో జరిగింది ఈ ఘటన. వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ ఏటావా  జిల్లాలో పోలీసులు ఓ యువకుడితో బలవంతంగా డాన్స్ చేయించారు. ఓ పాటకి ఆ యువకుడు డాన్స్ చేస్తుంటే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారి తోపాటు పక్కనే ఉన్న కానిస్టేబుల్ కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా బాగా డాన్స్ చేయాలి అంటూ ఆ యువకుని ప్రోత్సహిస్తున్నారు. 

 


 ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సదరు యువకుడితో పోలీసులు ఎందుకు అలా డాన్స్ చూపించారు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. లాక్ డౌన్ నిబంధనలు  ఉల్లంఘించినందుకు పోలీసులు ఆ యువకుడితో అలా డాన్స్ చేయాలని శిక్ష విధించారు లేక మరేదైనా కారణం ఉందా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. కొంతమందైతే లాక్ డౌన్  నిబంధనలు ఉల్లంఘించినందుకే  యువకుడికి ఇలాంటి శిక్ష విధించారు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసిన ఓ యువకుడు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: