ఏపీలో మద్యంపై రగడ కొనసాగుతూనే ఉంది.  కరోనా సమయంలో మద్యం అమ్మకాలపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అసలు ఇలాంటి టైంలో మద్యం అమ్మకాలు జరపడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా మద్యపాన నిషేధం చేయాలనుకునే వారు ఇదే అవకాశంగా తీసుకుని మధ్య నిషేధం చేయొచ్చుగా అని అంటున్నారు.

 

ఇక వీటికి కౌంటర్లుగా వైసీపీ నేతలు మాట్లాడుతూ..కేంద్రం పర్మిషన్ తోనే వైన్స్ ఓపెన్ చేశామని, లాక్ డౌన్ సడలింపులు వచ్చిన నేపథ్యంలో మద్యం అమ్మకాలు మొదలుపెట్టామని చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని వదిలేసిన టీడీపీ నేతలు..ప్రస్తుతం మద్యం ధరలు పెంచడం, కొత్త బ్రాండ్లు అమ్మడంపై విమర్సలు చేస్తున్నారు.

 

జె ట్యాక్స్ వసూలు చేయడానికే కొత్త బ్రాండ్లు వచ్చాయని, పేదలు నడ్డి విరచడానికే ధరలు పెంచారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ విమర్శలకు కూడా వైసీపీ నేతల దగ్గర నుంచి కౌంటర్లు వస్తున్నాయి. మద్యం కొనాలంటే షాక్ కొట్టాలనే ఉద్దేశంతోనే ధరలు పెంచామని, ధరలు పెంచితే మద్యం కొనరని చెబుతున్నారు. అలాగే కొత్త బ్రాండ్లు గతంలో చంద్రబాబు ఏవైతే డిస్టలరీలకు పర్మిషన్ ఇచ్చారో, ఇప్పుడు కూడా అవే తయారు చేస్తున్నాయని అంటున్నారు.

 

ఇక టీడీపీ, వైసీపీ నేతల మాటల యుద్ధం మధ్యలోకి ఓ టీడీపీ అనుకూల మీడియా వచ్చింది. ఆ మీడియా డైరక్ట్ గా మందుబాబులు దగ్గరకు వెళ్లి  కొత్త బ్రాండ్లు ఎలా ఉన్నాయంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఆ మందుబాబులు కూడా ఈ కొత్త బ్రాండ్లు అసలు టేస్ట్ లేవని, కానీ మద్యానికి అలవాటు అయ్యాం కాబట్టి తప్పక తాగుతున్నామని చెబుతున్నారు. అలాగే ధరలు కూడా దారుణంగా ఉన్నాయని మందుబాబులు బాధపడుతున్నట్లు చూపించారు.

 

ఇక ధరలు పెంచిన మాత్రాన అమ్మకాలు ఆగవని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆ మీడియా ఏపీలో ఉన్న బ్రాండ్లుని హైలైట్ చేస్తూ, తెలంగాణలో మంచి బ్రాండ్లు ఉన్నాయని చూపించే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికైతే మందుబాబులు కోసం టీడీపీ గట్టిగానే  పోరాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: