తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. కరోనా వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్న యువతిపై.. డాక్టర్ కామంతో ఊగిపోయి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఐసోలేషన్ వార్డులోనే యువతిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెలుగులోకి వచ్చింది. ఇరవై ఏళ్ల యువతికి ఇటీవలే కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరింది. కరోనా పేషెంట్ లకు చికిత్స అందిస్తున్న ఓ డాక్టర్ కి కూడా కరోనా సోకడంతో అతనికి కూడా పేషంట్స్ లతో సహా చికిత్స అందిస్తున్నారు. కాగా కరోనా బారిన పడిన ఆ వైద్యుడు బ్రతుకు పోరాటం చేయాల్సింది పోయి కామం తో ఊగిపోయాడు. అదే ఐసోలేషన్ వార్డులో ఉన్న యువతిపై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై యువతి పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేసింది.
వెంటనే స్పందించిన పోలీసు అధికారులు యాజమాన్య బాధ్యతారాహిత్యం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఓకే వార్డులో ఇద్దరు కరోనా పేషెంట్ లను ఉంచి చికిత్స అందించినందుకు గాను చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు కరోనా తగ్గగానే నిందితుని అరెస్టు చేస్తామని తెలిపారు.
Powered by Froala Editor
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి