ఇప్పటివరకు కరోనా వ్యాధి రోగి నుండి వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు మరియు దగ్గర మిత్రులకు వ్యాపిస్తోందని అనుకున్నాము. కానీ ఎలాంటి సంబంధం లేని రోగుల ద్వారానే వైరస్ వేగంగా ఇతరులకు సోకిందని తాజా సర్వేలో బయటపడింది. ఇందులో 71 శాతం మంది కరోనా రోగులలో.. వారి ద్వారా వారి సన్నిహితులకు, కుటుంబసభ్యులకు వైరస్ వ్యాపించలేదని రుజువయింది. ఈ విధంగా ఆలోచిస్తే... కరోనా రోగుల్లో అత్యధికశాతం మంది వైరస్ వాహకులుగా పని చేయలేదు. వ్యాధి ఉన్న విషయం తెలియక, తెలిసినా నిర్లక్ష్యంగా బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన వ్యక్తులే వైరస్‌ను పెద్ద ఎత్తున వ్యాపింపజేశారని వెల్లడైంది. భారత్‌లో కరోనా మృతుల్లో ఎక్కువమంది 40-69 ఏండ్ల మధ్యవయస్కులే ఉన్నారని సీడీడీఈపీ డైరెక్టర్ రమణ లక్ష్మీనారాయణ తెలిపారు. కాబట్టి ఎవరైనా సర్ఫ్ అత్యంత జాగ్రత్తగా ఉండాలని వీరు సూచిస్తున్నారు. బయటకి వెళ్లాల్సివస్తే తప్పనిసరిగా మాస్కును ధరించాలి.
సర్వే వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ఆగస్టు 1నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో కరోనా రోగుల సన్నిహితుల్లో దాదాపు 30లక్షల మంది వివరాలు సేకరించారు.
చైనా, యూరప్, అమెరికాల నుంచి వచ్చిన వారి ద్వారానే ఈ రాష్ర్టాల్లోకి కరోనా ప్రవేశించిందని తేలింది.
కరోనా రోగుల్లో 71 శాతం మంది వాహకులుగా పని చేయలేదు. వారి ద్వారా వారికి సన్నిహితంగా మెలిగినవారికి కరోనా సోకలేదు.
బస్సులు, ఇతర రవాణా సాధనాల్లో చాలాసమయం కలిసి ప్రయాణించటం ద్వారానే అత్యధికమందికి వైరస్ సోకింది.
ఈ రెండు రాష్ట్రాల్లో ఒక్కో కరోనా రోగి సగటున 80మందితో సన్నిహితంగా మెలిగినట్టు గుర్తించారు.
కుటుంబసభ్యులు, సమవయస్కులకు వైరస్ వ్యాప్తిచేసిన వారిలో 14 ఏండ్లలోపువారే అధికంగా ఉన్నారు. పాఠశాలలు మూతపడినప్పటికీ పిల్లల్లో వైరస్ వ్యాప్తి అధికంగానే ఉన్నది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి