ఇటీవల కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం మొత్తం అతలాకుతలమై పోయిన విషయం తెలిసిందే భాగ్యనగర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఎంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం మొత్తం జలదిగ్బంధంలో అల్లాడిపోయింది. ఇప్పటికి కూడా నగరంలోని కొన్ని ప్రాంతాలు వరదల నుంచి బయటకు రాలేక పోతున్నాయి   . అయితే ఇప్పటికే భారీగా కరోనా  వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగర వాసులు అందరూ బెంబేలెత్తిపోతు  కరోనా వైరస్ తో పోరాటం చేస్తూ ఉంటే అదే సమయంలో భారీ వరదలు వచ్చి హైదరాబాద్ నగరాన్ని మొత్తం ముంచెత్తిన నేపథ్యంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని గడుపుతున్నారు.


లోతట్టు ప్రాంతాలు సాధారణ ప్రాంతాలలు  అనే తేడా లేకుండా హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలు కూడా పెద్ద పెద్ద చెరువులను తలపించాయి. జనావాసాల్లోకి పూర్తిగా నీరు చేరిపోవడం కనీసం పునరావాస కేంద్రాలకు వెళ్లాలి అని అనుకున్నప్పటికీ భారీగా వరద నీటితో పెద్ద పెద్ద చెరువులను తలపిస్తున్న రోడ్లపై ఎటు వెళ్లాలో తెలియక.. ఎటు వెళ్తే ప్రాణం పోతుందో  అనే భయంతో చివరికి బిక్కుబిక్కుమంటూ నగర వాసులు అందరూ జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ లో వరదలు సృష్టించిన బీభత్సం నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తక్షణ సహాయం కింద 550 కోట్ల నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే.



 దాదాపుగా హైదరాబాద్ లోని వరద బాధిత కుటుంబాల అందరికీ ప్రభుత్వం ఏకంగా పది వేల రూపాయల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే, హైదరాబాద్ లోని వరద వరద బాధితులు  అందరికీ సాయం పంపిణీ కొనసాగుతోంది. 780 మంది అధికారులు బృందాలుగా ఏర్పడి ప్రతి రోజూ శరవేగంగా వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉండటం గమనార్హం. కాక 1.13 లక్షల కుటుంబాల కోసం ప్రభుత్వం 113 కోట్ల నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటి వరకు 70 వేల వరద బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం అందినట్లు తెలుస్తోంది అయితే దసరా ముగిసేసరికి అందరికీ వరద సాయం అందాలని  కేసిఆర్ ఆదేశించినప్పటికీ అది ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: