సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని సినిమా ల నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ కి ఈ ఎన్నికలలో గట్టి దెబ్బ తగిలింది.. రెండు నియోజక వర్గాల్లో గెలవలేకపోయిన పవన్ కళ్యాణ్ మొత్తానికి ఒక సీటు ను మాత్రం గెలుచుకుని దేవుడా అనుకుంటూ బయట పడ్డాడు. ఇక రాజకీయాల్లో చేసేదేం లేక మళ్ళీ సినిమా బాటపట్టిన పవన్ కళ్యాణ్ పార్ట్ పొలిటిషన్ అనే పేరు ను మోస్తూ మళ్ళీ ఎన్నికలనాటికి అవసరమయ్యే అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.. ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ తో పవన్ జత కట్టిన సంగతి తెలిసిందే..

అయితే రాజధాని అంశంలో ఆదిలోనే వారి పొత్తుకు కొంత అడ్డంకి ఏర్పడింది.. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండడంతో ఇరు పార్టీ ల మధ్య పొత్తు అసలే పొసగట్లేదు అని అందరు అంటున్నారు.. బీజేపీతో స్నేహంలో ఉన్న పవన్‌ మాత్రం తాను అమరావతికే కట్టుబడి ఉన్నానని అన్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాలు అన్యాపదేశంగానే బైటపడ్డాయంటున్నారు. రెండు మిత్ర పార్టీల నుంచి చెరో విధమైన అభిప్రాయం వ్యక్తం కావడం రాజకీయ వ్యూహంగాను భావించొచ్చు, అదే సమయంలో ఇరు పార్టీల మధ్య భావ వైరుధ్యంగాను అభిప్రాయపడొచ్చు. కానీ ఇక్కడ వ్యూహానికంటే వైరుధ్యాన్నే ఎక్కువ మంది చూస్తున్నారు.

ఇక తాజాగా పవన్ కళ్యాణ్ గ్రేటర్ ఎన్నికల్లో చేతులెత్తేశాడు.  భేషరతుగా బీజేపీ కి మద్ధతు ప్రకటించింది.బీజేపీ గెలుపుకోసం కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఏకపక్షంగా బీజేపీకి మద్ధతు ప్రకటించిన తీరు పలువురు జనసైనికులను నిరాశకు గురిచేసింది.ఇక తదుపరి వంతు తిరుపతి ఉప ఎన్నికలదవుతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో బీజేపీకి అండగా ఉంటామని తేల్చేసిన పవన్ నుంచి తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా అదే రీతిలో మద్ధతుని బీజేపీ ఆశిస్తోంది.దానికి అనుగుణంగానే సుదీర్ఘకాలం తర్వాత హస్తినలో పవన్ కి అమిత్ షా వంటి వారి మోక్షం ఖాయంగా కనిపిస్తోంది.2014 ఎన్నికలకు ముందు మోడీతో పవన్ భేటీ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఇదే అయన ఢిల్లీ కి వెళ్లడం..

మరింత సమాచారం తెలుసుకోండి: