ఏపీలో టీడీపీ బలోపేతమే లక్ష్యంగా చంద్రబాబు ఇటీవల పార్టీలో పదవులని భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా ఎక్కువ పదవులు నేతలకు కేటాయించారు. అయితే ఈ పదవుల పంపకంలో చంద్రబాబు కొందరు సీనియర్ నేతలకు ఊహించని షాక్‌లు ఇచ్చారు. కొంతమందికి సరైన పదవులు కేటాయించలేదు. ఒకవేళ వారికి పదవులు ఇవ్వకపోయినా వారి వారసులకు సైతం ఎలాంటి పదవి కట్టబెట్టలేదు.

ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీ సీనియర్ నేత గౌతు శ్యామ సుందర శివాజీ కుమార్తె గౌతు శిరీషని జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చారు. అయితే శిరీష పలాస నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కూడా ఉన్నారు. ఒక ఒకప్పుడు టీడీపీలో కీలక పాత్ర పోషించిన మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతికి సైతం చంద్రబాబు న్యాయం చేయలేదు.

పైగా ఆమెని పొలిట్‌బ్యూరో నుంచి తప్పించి జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి ఇచ్చారు. ఇక ఈ పదవి వల్ల పెద్ద ఉపయోగం ఏంటో పార్టీ కేడర్‌కే తెలియదు. అయితే దీనిపై ప్రతిభా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది. తనకు సరైన పదవి ఇవ్వకపోయినా సరే, తన కుమార్తెకు కూడా ఎలాంటి పదవి ఇవ్వలేదనే ఆవేదన ఉందని తెలుస్తోంది. ప్రతిభా కుమార్తె గ్రీష్మ టీడీపీలో యాక్టివ్‌గానే ఉంటున్నారు. కానీ ఆమెకు ఎలాంటి పదవి ఇవ్వలేదు.

పైగా ప్రతిభా భారతి సొంత నియోజకవర్గం రాజాం బాధ్యతలు కూడా అప్పగించలేదు. 2014లో రాజాం నుంచి ప్రతిభా స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికల్లో బాబు, ప్రతిభాని సైడ్ చేసి, కొండ్రు మురళికి టిక్కెట్ ఇచ్చారు. ఇక కొండ్రు మురళి ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన దగ్గర నుంచి మురళి అటు పార్టీలో గానీ, ఇటు నియోజకవర్గంలో గానీ పెద్దగా కనిపించడం లేదు. అలా మురళి సరిగా లేకపోయినా సరే బాబు, మాత్రం ప్రతిభా కుమార్తెకు నియోజకవర్గ పగ్గాలు ఇవ్వలేదు. మొత్తానికైతే ప్రతిభా ఫ్యామిలీకి బాబు గట్టి షాకే ఇచ్చినట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: