మొన్నటి వరకు మహమ్మారి కరోనా  వైరస్ తో  ప్రపంచ దేశాలు మొత్తం అతలాకుతలం అయి పోయాయి అనే విషయం తెలిసిందే.  ఈ మహమ్మారి వైరస్కు వ్యాక్సిన్ కూడా అందుబాటు లో లేక పోవడంతో ప్రత్యామ్నాయ పైనే ఎక్కువ దృష్టి పెట్టాయి ప్రపంచ దేశాలు కానీ ప్రపంచ దేశా లలో శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి శర వేగంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం.. క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న సమయం లోనే వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తూ  నిర్ణయం తీసుకోవడం తో ఇప్పటికే కొన్ని దేశా లలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది.



 అగ్ర రాజ్యమైన అమెరికా లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతూ ఉండడం గమనార్హం. ఇక వాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి వ్యాక్సిన్ అందించేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఎంతోమంది కరోనా  వైరస్ సమయంలో ముందుండి ప్రజల ప్రాణాలను కాపాడటం లో కీలక పాత్ర వహించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన పారిశుద్ధ్య కార్మికులు పోలీసులు వైద్య సిబ్బంది అందరూ కూడా వాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ముందుగా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు.  ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు అమెరికాలో లాటరీ ద్వారా వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.



 ప్రస్తుతం అమెరికాలో 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు కూడా కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే అదనంగా మిగిలిపోయిన వ్యాక్సిన్లను అందుబాటులో ఉన్నవారికి ఇచ్చేందుకు ప్రస్తుతం వైద్య అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం లాటరీ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. అదనంగా మిగిలిపోయిన వ్యాక్సిన్  కోసం అందుబాటులో ఉన్నవారి  లో ఆసక్తి ఉన్నవారు పేరు రాసి ఇస్తే ఆ చీటీలు అన్నింటిలో కూడా ఒక చీటీని తీసి లాటరీ ద్వారా వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇలా లాటరీ ద్వారా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎంతో మంది యువత ఆసక్తి చూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: