ఇటీవలే సినీ ప్రముఖల ఇళ్లపై ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఎంతో మంది సినీప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయన్న విషయం తెలిసిందే.  ఇటీవలే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించుకుని  ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న తాప్సి ఇంట్లో ఐటీ సోదాలు జరగగా.. ఇది  బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అదే సమయంలో అటు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి అనే విషయం తెలిసిందే.



 అయితే అకస్మాత్తుగా హీరోయిన్ తాప్సి దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇళ్లలో  ఐటీ సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. అటు  ప్రతిపక్ష పార్టీలు ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తున్నాయి. అదే సమయంలో కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఇలా ఐటి సోదాలు నిర్వహించడం పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుబడుతున్నారు ఎంతోమంది. అయితే సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ సోదాలు నిర్వహించడం పై విమర్శలు వస్తున్న వేళ ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 గత ప్రభుత్వ హయాంలో కూడా ఎంతో మంది సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ సోదాలు జరిగాయి అంటూ గుర్తు చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. ఆ సమయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి సమస్య లేదు వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మాత్రం ఐటీ సోదాలు నిర్వహిస్తే  అదో పెద్ద సమస్యగా మారిపోయినట్లు వ్యవహరిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 సంవత్సరంలో ఇదే వ్యక్తులపై అప్పటి ప్రభుత్వం ఐటీ సోదాలు నిర్వహించింది అప్పుడు ఎవరు నోరు మెదపలేదు అంటూ వ్యాఖ్యానించిన  నిర్మలాసీతారామన్..  అప్పటి  ప్రభుత్వంలో జరిగితే పర్వాలేదు కానీ ఈ ప్రభుత్వంలో జరిగితే మాత్రం పెద్ద సమస్యగా మారిపోయిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: