కొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల గురించి ఇప్పుడు దేశం అంతా చర్చ జరుగుతోంది. అవి తమిళనాడు, కేరళ మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనిపై ఇప్పటికే అన్ని పార్టీలు రాజకీయ వ్యూహాలపై తమ దృష్టిని సారించాయి. ఈ ఎన్నికలలో బీజేపీ ఎలాగైనా ఆధిపత్యాన్ని చూపించాలని శత విధాలా ప్రయత్నిస్తోంది. అయితే ఎప్పటిలాగే ఎన్నికల ముందు సర్వేల పేరుతో హడావుడి సృష్టించడం మామూలే. అందులో భాగంగానే ఏపీకి చెందిన ఆత్మ సాక్షి సంస్థ తన సర్వేను చేసింది. ఏపీలో జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాల విషయంలోనూ ఆత్మ సాక్షి సర్వే చాలా దగ్గరగా చెప్పింది. దానితో వీరు ఇచ్చిన సర్వే పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సర్వే తమిళనాడులో ప్రజలు ఏ పార్టీకి మద్దతుగా ఉన్నారో తమ సర్వే ద్వారా కొన్ని కీలక విషయాలను బయట పెట్టారు. మొదటి విడుత సర్వే 15.12.2020 నుండి 10.01.2021 వరకు చేయడం జరిగింది. అలాగే రెండవ విడుత సర్వే 06.03.2021 నుండి 20.03.2021 వరకు చేయడం జరిగింది.

ముఖ్యంగా ఈ సర్వేలో ప్రజల నాడి ఎవరికి అనుకూలంగా ఉందో ఇందులో తెలుసుకోవడానికి ఈ సర్వేను చేశారు. ఇందులో కొన్ని అంశాలను ప్రామాణికంగా తీసుకుని సర్వేను మొదలుపెట్టారు. వాటిలో ముఖ్యంగా అవినీతి, యువత, ఎఐడీఎంకే పై బీజేపీ ప్రభావం, మహిళలు, నిరుద్యోగులు, వృద్దులు, అభివృధి మొదలైన అంశాలను తీసుకుని ప్రజల్ని ప్రశ్నించడం జరిగింది. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వ విధానాలను కూడా ఈ సర్వే పరిగణనలోకి తీసుకోవడం జరగింది.  ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావితం చేసే అంశాలు డీఎంకే - స్టాలిన్ ఫ్యాక్టర్....మరియు ఎఐడీఎంకె కి -ఫలనిస్వామి ఫ్యాక్టర్  బీజేపీ కమల్ హాసన్ ఫ్యాక్టర్.. డీఎంకే మరియు కాంగ్రెస్ కూటమికి 44.5 శాతం, ఏఐడీఎంకే మరియు బీజేపీ కూటమికి 29.9 శాతం, కమల్ హాసన్ పార్టీకి 7.5   శాతం దినకరన్ పార్టీకి 6.9 శాతం మరియు ఇతరులకు 11.2  శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే తెలియచేసింది. ఇక పోతే ఎమ్మెల్యే సీటుల విషయానికి వస్తే  

అత్యధికంగా డీఎంకే కూటమికి 167-170 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని తెలిపింది. ఏఐడీఎంకే కూటమికి 50 నుండి 53 ఎమ్మెల్యే సీట్లు. అలాగే కమల్ హాసన్ పార్టీకి 8 నుండి 9 సీట్లు మరియు దినకరన్ పార్టీకి 2 - 6 మరియు ఇతరులకు 4 - 8 సీట్లు వస్తాయని తన సర్వే ద్వారా తెలిపింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఏఐడీఎంకే పరిపాలనా కాలంలో తమ స్వతహాగా పాలించకుండా, బీజేపీ ఎలా చెబితే అలా చేయడం వీరికి ప్రజల్లో ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అంతే కాకుండా ఏఐడీఎంకే లో వర్గ పోరు కారణంగా పార్టీలో అనిశ్చితి నెలకొంది. జయలలిత లేని లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది డీఎంకే పార్టీకి అనుకూలంగా మారె అవకాశం ఉందని గట్టిగ సమాచారం. అయితే బీజేపీ మాత్రం ఖచ్చితంగా తమిళనాడు లో ఏఐడీఎంకె కూటమి అధికారంలోకి వస్తుందని నొక్కి చెబుతున్నారు. బీజేపీ పై ప్రజలకు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ఇందుకు కారణాలు చాలా ఉన్నప్పటికీ, ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్ మరియు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ విషయంలో వీరికి ప్రజలు తీర్పు ఈ విధంగా ఉంటుందో చూడాలి. మరి ఈ జరగనుంది చూడాలి.
మరి అసలు సామర్మ్లో ఏ విధంగా ప్రజలు తమ తీర్పును ఇవ్వనున్నారో తెలియనుంది.





మరింత సమాచారం తెలుసుకోండి: