నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు  వ్యవహారంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేయడం..  ఇక ఆ తర్వాత ఈ రోజే తనను పోలీసులు దారుణంగా కొట్టారు అంటూ ఏకంగా రఘురామకృష్ణంరాజు తన కాళ్లకు అయిన గాయలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనంగా మారిపోయింది.  పోలీసులు దారుణంగా తన పై లాఠీఛార్జ్ చేశారు అంటూ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.



 ఈ విషయంపై హైకోర్టులో సైతం ఫిర్యాదు చేశారు వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. దీంతో ఈ అంశం కాస్తా సంచలనంగా మారిపోయింది. అయితే గుంటూరు జీజీహెచ్లో  చికిత్స తీసుకున్న రఘురామకృష్ణంరాజు.. ఆ తర్వాత సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స తీసుకునేందుకు వెళ్లారు. అయితే సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ వేయడంతో అటు అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు వైసీపీ రెబల్ ఎంపీ.  ఇలాంటి పరిణామాల  నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టులో ఎంతో సీరియస్గా విచారణ జరుగుతున్న సమయంలోనే..  ఇటీవలే వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఈ విషయంపై  ఫిర్యాదు చేశారు.


 ఇక ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ వెంటనే స్పందిస్తూ..  ఈ ఘటనపై  వివరణ ఇవ్వాలంటూ ఏపీ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా దీని బదులు ఇవ్వాలని.. అంతేకాకుండా రఘురామకృష్ణంరాజు పై పోలీసులు దాడి చేశారనే ఆరోపణలపై అంతర్గత విచారణ జరపాలంటూ  సిఐడి డిజిని ఆదేశించింది మానవ హక్కుల కమిషన్.  ఇక రఘురామ వ్యవహారంలో మానవ హక్కుల కమిషన్ ఎంట్రీ ఇవ్వడంతో ఆంధ్ర రాజకీయాలు ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది.  దీనిపై ప్రభుత్వం ఏమి వివరణ ఇస్తుంది అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: