గత రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎంతోమంది ప్రజలు ఈ కరోనా వైరస్ ధాటికి బలైపోయారు. మొదటి దశ రెండవ దశ అంటూ, కరోనా వైరస్ భారత్ పై తన ప్రతాపాన్ని చూపించింది. ఈ కరోనా వైరస్ వలన ఎంతోమంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. దీని వలన ఎంతోమంది పిల్లలు అనాధలుగా మారిపోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డ చిత్రాలను చూశాము. ఇంతటి భయంకరమైన పరిస్థితుల నడుమ ప్రజలంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఈ వైరస్ ను నియంత్రించడానికి ఇప్పటి వరకు శాశ్వత చికిత్స లేనప్పటికీ, వ్యాక్సిన్ రూపంలో కొంత మేరకు వైరస్ బారి నుండి కాపాడుకునే అవకాశం మనకు కలిగింది. ఇలా వ్యాక్సిన్ రూపంలో ఉన్న ఏకైక మార్గాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలని ప్రభుత్వాలు వైద్య నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వీలైనంత తొందరగా అందహరికీ వ్యాక్సిన్ ను అందించడానికి కృషి చేస్తున్నాయి. అంతే కాకుండా ప్రపంచ దేశాలనే కూడా వ్యాక్సిన్ ను తమ ప్రజలకు అందించడానికి చర్యలను వేగవంతం చేస్తున్నాయి.

కాగా ప్రస్తుతం కొన్ని రకాల వ్యాక్సిన్ లు అందుబాటులో ఉండగా ప్రపంచ దేశాలు ఏ వ్యాక్సిన్ పై మొగ్గు చూపుతారనేది వారి వ్యక్తిగత విషయం అన్నది తెలిసిందే. అయితే ఇండియాలో కరోనా వైరస్ ను నిలువరించడానికి రెండు రకాల వ్యాక్సిన్ లు తయారుచేయబడ్డాయి. వాటిలో కొవాగ్జిన్ మరియు కోవిషిల్డ్ లు ఉన్నాయి. ఈ రెండు వ్యాక్సిన్ లలో  కొవాగ్జిన్ సమర్థవంతంగా పనిచేస్తోందని తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్ వలన ఇమ్మ్యూనిటి పవర్ పెరుగుతోంది అన్న కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. ఈ  కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కెనడా దేశం ఆ వ్యాక్సిన్ ను పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దాని కోసం ఇప్పటికే భారత్ బయోటెక్ కు కెనడా దేశంలోని ఆక్యుజెన్ సంస్థ రూ.110 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.

వ్యాక్సిన్ ను సరఫరా చేసిన తరువాత మిగిలిన బ్యాలన్స్ అమౌంట్ ను చెల్లించనుంది. ఇప్పటికే ప్రపంచంలోని దాదాపు 60 దేశాలలో ఈ వ్యాక్సిన్ ను సరఫరా చేయడానికి భారత్ బయోటెక్ కు అనుమతులు పొందినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలియచేసింది. ఈ విధంగా కొవాగ్జిన్ వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఇది మన దేశం గర్వించదగ్గ విషయమని చెప్పవచ్చు. గతంలో అయితే ఒక వ్యాక్సిన్ ను మనమే విదేశాల నుండి కొనుక్కునే పరిస్థితి నుండి ప్రపంచదేశాలన్నీ ఇండియా వెంట పడే స్థాయికి చేరుకోవడం సంతోషించాల్సిన విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: