కరోనా వైరస్.. ఈ పేరు చెపితే చాలు జనాలు మొత్తం హడలిపోయే పరిస్థితి నెలకొంది.  ఎందుకంటే ఒక దశ కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అనుకునేలోపే రెండవ దశ కరోనా వైరస్ దూసుకువచ్చి ప్రాణాలను తీస్తుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది కరోనా వైరస్ పేరెత్తితే చాలు వణికిపోతున్నారు. అయితే ప్రస్తుతం దాదాపుగా చాలా మందిలో వైరస్ పై అవగాహన పెరిగి పోయింది. ఈ క్రమంలోనే వైరస్ అంటే భయపడటం మానేసి వైరస్ ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ వైరస్ బారిన పడినప్పటికీ మనోధైర్యంతో ఈ మహమ్మారి పై పోరాటం చేసి విజయం సాధిస్తున్నారు.



 అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో అందరిలో మరింత ధైర్యం వచ్చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం అందరూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా ఎంతోమంది వైరస్ పై సరైన అవగాహన లేకపోవడంతో వైరస్ అంటేనే భయపడిపోతున్నారు. అంతేకాదు వైరస్ బారిన పడితే ఏకంగా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. మలేషియాలో ఒక తమిళ కుటుంబం నివాసం ఉంటుంది.



 ఇక ఇటీవలే ఆ కుటుంబంలోని తల్లీకూతుళ్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే కరోనా వైరస్ సోకటంతో చివరికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. రవి రాజా అనే 40 ఏళ్ల వ్యక్తి భార్య సత్య, కుమార్తె రాణి తో కలిసి పన్నెండేళ్ల  నుండి మలేషియాలో  నివాసం ఉంటున్నాడు  అయితే ఇటీవల రవితేజ, భార్య, కూతురికి కరోనా వైరస్ వచ్చింది. రవి రాజా ఆరోగ్యం క్షీణించడంతో  ఆసుపత్రిలో చేరారు. ఇక భార్య కూతురు హోం ఐసోలేషన్  లో ఉన్నారు.అయితే కరోనా వైరస్ కారణంగా ఇక ఎంతగానో మనస్తాపం చెందారు ఆ తల్లి కూతుర్లు. ఈ క్రమంలోనే ఇంటి పై నుండి దూకి  ఆత్మహత్య చేసుకున్నారు. ఇక విషయం తెలిసి అటు రవిరాజ కూడా ఎంతగానో కుంగిపోయాడు. చివరికి ఆరోగ్యం క్షీణించి ఇటీవలే మృతిచెందాడు. అయితే భారత ప్రభుత్వం మలేషియా నుంచి తమ బంధువుల అస్తికలు తెప్పించేలా  చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: