ఇటీవలి కాలంలో దొంగల బెడద రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది. ప్రజలందరూ దొంగల దోపిడీకి గురికాకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు  పోలీసులు కూడా ఇక దొంగతనాలకు పాల్పడే ముఠాల భరతం పట్టేందుకు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేస్తున్నారు. చోరీ ముఠాల దొంగతనాలు మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గడం లేదు.  జనాలు ఎంత జాగ్రత్తగా ఉన్నా పోలీసులు ఎంత పకడ్బందీగా నిఘా పెట్టిన దొంగలు మాత్రం ఏదో ఒక విధంగా వినూత్న రీతిలో దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు.


 ఇటీవలి కాలంలో ఎంతోమంది ఏకంగా సోషల్ మీడియాను కూడా దొంగతనాలు చేయడానికి వాడుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా దొంగతనాలు ఎలా చేయాలి అని నేర్చుకోవడం ఇక దొంగతనం చేసిన తర్వాత పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలి అన్న విషయాన్ని కూడా నేర్చుకుని ఇక పక్కా ప్లాన్ ప్రకారమే దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ కొంత మంది దొంగలు నయా ప్లాన్ తో ఏకంగా పోలీసులకే షాక్ ఇచ్చారు. కార్ల దొంగతనం చేయాలి అని అనుకున్నారు. ఈ క్రమంలోనే రొటీన్గా కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించారు ఇక్కడ దొంగల ముఠా.



 దొంగల్లాగా వెళ్లి కార్లు కొట్టేయడం చాలా కష్టం.. అందుకే పోలీసులు లాగా వెళ్లి కార్లు కొట్టేయాలి అని అనుకున్నారు. ఈ క్రమంలోనే నకిలీ పోలీస్ అవతారమెత్తారు చెన్నైలో ఒక గ్యాంగ్. చిత్తూరు జిల్లా కుప్పం మండలం బంగా సత్తం లో ఒక కారును ఆపారు ఈ నకిలీ పోలీసులు. తాము పోలీసులమని పత్రాలు అన్ని చూపించాలి అంటూ దబాయించారు.  కారులో ఉన్న వ్యక్తులు నిజంగానే పోలీసులు అనుకొని భయపడిపోయారు. ఇక ఆ తర్వాత కారులో ఉన్న ప్రయాణికులను దింపేసి పోలీస్ స్టేషన్కు వచ్చి కారు తీసుకెళ్లండి అంటూ గంభీరంగా చెప్పి అక్కడి నుంచి కారు తీసుకుని వెళ్ళిపోయారు. ఇక బాధితులు పోలీసు స్టేషన్కు వెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు. దొంగల ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: