మనము మన పిల్లలు సుఖంగా సంతోషంగా ఉండాలంటే మనము ఆర్ధికంగా బాగా బలంగా ఉండాలి. కొందరైతే వారి తల్లితండ్రుల నుండి సంక్రమించిన ఆస్తులను అనుభవిస్తూ ఉంటరు. మరి కొందరు వ్యాపారాలను చేసుకుంటూ సుఖంగా ఉంటారు. అయితే ఏ ఆధారమూ లేని నిరుపేద కుటుబంలోనుండి వచ్చిన వారు ఒక పని చేసుకుంటూ ఉంటే, జీవితాంతం అదే పని చేసుకుంటూ ఉండాలి. ఇంకా వారిలో ఆర్ధికంగా ఎటువంటి ఎదుగుదల ఉండదు. అందుకే నిరుపేద అయినా మధ్యతరగతి వారు అయినా వారి పిల్లల్ని బాగా చదివించాలని ఎంతో ఆశపడుతుంటారు. అందుకే ఒక పూట తిన్న తినకపోయినా పిల్లల్ని మాత్రం ఒక మంచి ప్రైవేట్ స్కూల్ లో చేర్పిస్తారు. 

అయితే ప్రస్తుతం ఉన్న కాలంలో  ప్రైవేట్ స్కూల్ లోనే మంచి విద్య దొరుకుంటుంది అని అనుకుంటున్న ఎంతోమంది తల్లితండ్రులు కొన్ని కీలక విషయాలను తెలుసుకోవాల్సిన వసరం ఉంది. మీరు స్కూల్ లో చేర్పించే ముందు కింది విషయాలు తెలుసుకుని చేర్చండి.

* మొదటగా మీ ఇంటికే దగ్గరగా ఉన్న స్కూల్ ను సెలెక్ట్ చేసుకోండి. ఆ స్కూల్ లో వాతావరణం ఎలా ఉందో గమనించండి. తరగది గదులు ఏ విధంగా ఉన్నాయి, అంటే కొన్ని స్కూల్స్ లో చాలా ఇరుకుగా ఉండే గదులను నిర్మించి ఉంటారు. అలా కాకుండా కొంచెం విశాలంగా ఉండే గదులు ఉన్నాయో లేదా చుడండి.

* పిల్లలు ఆడుకోవడానికి సరైన ఆట స్థలం ఉందా లేదా పరిశీలించండి. ప్రతి పిల్లవాడికి చదువుతో పాటు ఆటలు కూడా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఉపయోగపడుతాయి. చాలా వరకు పట్టణాల్లో  ఆట స్థలాలు ఉండడం అరుదు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి.

* మీరు చేర్చే స్కూల్ ప్రభుత్వ అనుమతి పొంది ఉన్నదా లేదా అన్నది డైరెక్ట్ గా ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకోండి. కొందరైతే ఎటువంటి గుర్తింపు లేకపోయినా నడిపిస్తూ ఉంటారు. ఇది పిల్లలకు ఇచ్చే సర్టిఫికెట్స్ వలన గుర్తింపు ఉండదు.

* స్కూల్ లో ఉన్న మొత్తం పిల్లలకు సరిపడేలా ఉపాధ్యాయులు ఉన్నారా లేదా చెక్ చేయండి. అన్నింటికన్నా ఇది చాలా ముఖ్యమైనది. కొన్ని స్కూల్స్ లో 100 మంది పిల్లలకు ఇద్దరో ముగ్గురో టీచర్లు ఉంటారు. అలాంటప్పుడు అంతమందిని వీరు ఎలా కంట్రోల్ చేయగలరు. ఎవరు చదువుతున్నారో ఎవరు చదవడంలేదో ఎలా తెలుస్తుంది.


* స్కూల్ బిల్డింగ్ ఎలా ఉంది. పిల్లల్ని చూసుకునే ఆయాలు వారిని సరిగా చేసుకుంటున్నారా అనేది గమనించండి. ఓవరాల్ గా పరిశుభ్రత కు సంబంధించి ప్రమాణాలను పాటిస్తున్నారా ? కరోనా కాలం కావున నిబంధనలను పాటిస్తున్నారా చూడండి.  

ఈ విధంగా కొత్తగా చిన్న పిల్లలని ప్రధమ స్థాయిలో చేర్పించే పిల్లల తల్లితండ్రులు తెలుసుకుని చేర్పించడం ప్రధానం.

 



 

మరింత సమాచారం తెలుసుకోండి: