
అయితే ఈ జాబితాలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంలు ఖచ్చితంగా ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రెండేళ్లలో వీరి మీద వచ్చిన విమర్శలు మరో మంత్రి మీద రాలేదనే చెప్పొచ్చు. అలాగే వీరు పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక హిందూ దేవాలయాలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఈ దాడులు ఎలా జరిగాయి..ఎవరు చేశారని అంశాలని బయటపెట్టడంలో వెల్లంపల్లి ఫెయిల్ అయినట్లే కనిపిస్తోంది.
అలాగే పలు దేవాలయాల్లో అవినీతి ఎక్కువగా జరుగుతుందని, దీనికి వెల్లంపల్లిదే బాధ్యత అని ప్రతిపక్షాలు విమరిస్తున్నాయి. వెల్లంపల్లి దాదాపు రూ.1000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని జనసేన నేత పోతిన మహేష్ ఆరోపిస్తున్నారు. దేవాలయాల్లో కొబ్బరి చిప్పలు మొదలు అన్నీ మింగేసిన వెల్లంపల్లి ఇప్పుడు ఇసుకలో అక్రమంగా వందల కోట్లు దోచుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా చాలా అంశాల్లో ఆరోపణలు ఎదురుకుంటున్న వెల్లంపల్లికి ఈ సారి మంత్రి పదవి పోవడం ఖాయమని అంటున్నారు.
అటు గుమ్మనూరు జయరాంది కూడా అదే పరిస్తితి అని, రెండేళ్లలో అనేక అవినీతి ఆరోపణల్లో జయరాం చిక్కుకున్నారు. ఈఎస్ఐ స్కామ్‌కు సంబంధించి జయరాం తనయుడు ఓ బెంజ్ కారు లంచంగా తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అలాగే తన సొంత నియోజవర్గంలో భూ కబ్జాలకు పాల్పడ్డారని, పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ ఆరోపణలే మంత్రికి బాగా మైనస్ అవుతున్నాయి. దీంతో నెక్స్ట్ జయరాం మంత్రివర్గంలో కొనసాగడం కష్టమని అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఇద్దరు మంత్రులు మంచి పనితీరు కనబర్చడంలో కూడా వెనుకబడి ఉన్నారని, అందుకే వీరికి జగన్ భారీ షాక్ ఇవ్వబోతున్నారని చెబుతున్నారని ప్రచారం జరుగుతుంది.