దివంగత కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం...మళ్ళీ చిక్కుల్లో పడుతున్నట్లే కనిపిస్తోంది. ఇప్పుడుప్పుడే పార్టీలో యాక్టివ్ అవుతున్న శివరాంపై సొంత పార్టీ కార్యకర్తలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్తితి వస్తుంది. గతంలో శివరాం చేసిన కార్యక్రమాలు ఇప్పుడు రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. తాజాగా తమ సొంత వూరు కల్లకుంటలో శివరాం పర్యటన పెట్టుకున్నారు. అక్కడ తన తండ్రి దివంగత కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనుకున్నారు.

ఈ కార్యక్రమానికి అచ్చెన్నాయుడు, దేవినేని ఉమాలకు ఆహ్వానం పంపారు కూడా. కానీ ఆ గ్రామంలో ఉన్న కొందరు టి‌డి‌పి కార్యకర్తలు ఈ కార్యక్రమానికి రావోద్దని అచ్చెన్న, ఉమాలకు సూచించారు. గతంలో అధికారంలో ఉండగా, తమ దగ్గర నుంచి కోడెల శివరాం రూ.32 లక్షలు తీసుకున్నారని, ఆ డబ్బులు తిరిగి ఇప్పించాలని టి‌డి‌పి పెద్దలని కోరారు. అసలు కోడెల శివరాం వల్ల తాము బాగా నష్టపోయామని, అలాగే ఆయన వల్ల సత్తెనపల్లి, నరసారావుపేట నియోజకవర్గాల్లో పార్టీ తీవ్రంగా నష్టపోయిందని, భవిష్యత్‌లో కూడా ఇంకా నష్టపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.

అయితే ఈ సమస్యని పరిష్కరిస్తామని అచ్చెన్న చెబుతున్నారు. ఇప్పటికే సత్తెనపల్లి ఇంచార్జ్ పదవి కోసం శివరాం తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరగడం మొదలుపెట్టారు. కానీ ఆయనకు కొందరు టి‌డి‌పి కార్యకర్తలు సహకరించడం లేదు. గతంలో ఆయన చేసిన పనుల వల్లే తమకు, పార్టీకి బాగా నష్టం జరిగిందని చెబుతున్నారు. ఇక సత్తెనపల్లిలో ఉన్న సమస్యని పరిష్కరించడానికి టి‌డి‌పి అధిష్టానం కృషి చేస్తోంది. ఎలాగోలా కార్యకర్తలకు నచ్చజెప్పి శివరాంకు ఇంచార్జ్ పదవి ఇవ్వాలని అనుకుంటున్నారు. కానీ కార్యకర్తలు శివరాంని ఒప్పుకుంటారా లేదా అని చెప్పలేం.

మ‌రోవైపు ఇదే సీటు కోసం టీడీపీ లో ఎక్క‌డా లేని డిమాండ్లు నెల‌కొన్నాయి. అటు రాయ‌పాటి వార‌సుడు రంగారావుతో పాటు మాజీ ఎమ్మెల్యే వైవి. ఆంజ‌నేయులు ఇత‌ర నేత‌లు అక్క‌డ పోటీ ప‌డుతున్నారు. మ‌రి ఫైన‌ల్ గా స‌త్తెన‌ప‌ల్లి టీడీపీ ప‌గ్గాలు ఎవ‌రికి ద‌క్కుతాయో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: