తెలుగుదేశం అంటేనే కమ్మ పార్టీ అని ప్రత్యర్ధులు ఎప్పుడు విమర్శలు చేస్తుంటారు. ఎందుకంటే టి‌డి‌పిలో కమ్మ వర్గానికి ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎన్టీఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి నడుస్తోంది. ఎందుకంటే పార్టీ అధినేత కమ్మ కులానికి చెందిన వ్యక్తి కావడంతో, ఆ పార్టీలో సహజంగానే కమ్మ నాయకుల ప్రభావం మొదట నుంచి ఉంటూ వస్తుంది. ఈ కమ్మ వర్గం పార్టీకి బాగానే సపోర్ట్‌గా ఉంటూ వస్తుంది.

కానీ 2019 ఎన్నికల తర్వాత కమ్మ వర్గం చెల్లాచెదురైనట్లు కనిపిస్తోంది. కమ్మ వర్గం కొంతవరకు వైసీపీ వైపు కూడా మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. పైగా జగన్ దెబ్బకు టి‌డి‌పిలో ఉన్న కమ్మ నేతలు చిత్తుగా ఓడిపోయారు. ఇప్పటికే ఆ కమ్మ నేతలు కోలుకోలేకపోతున్నారు. ఆఖరికి చంద్రబాబుతో సహ మిగిలిన కమ్మ నేతలు బాగా చిత్తు అయిపోతున్నారు. ఇటీవల స్థానిక ఎన్నికల్లో బడా కమ్మ నేతలంతా చిత్తు అయ్యారు.

అసలు మొదట కుప్పంలో చంద్రబాబు చిత్తుగా ఓడారు. అక్కడ ఒక జెడ్‌పి‌టి‌సి కూడా టి‌డి‌పి గెలుచుకోలేదు. ఇక 66 ఎం‌పి‌టి‌సిలకు 3 మాత్రమే గెలుచుకుంది. హిందూపురంలో బాలయ్య పరిస్తితి అంతే 43 ఎం‌పి‌టి‌సిలకు 7 మాత్రమే గెలుచుకున్నారు. రాప్తాడులో పరిటాల సునీత 81 ఎం‌పి‌టి‌సిలకు 9 స్థానాలని గెలిపించుకోగా, ధర్మవరంలో శ్రీరామ్ ఒక ఎం‌పి‌టి‌సి కూడా గెలిపించలేకపోయారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్...75 ఎం‌పి‌టి‌సిలకు 4 చోట్ల మాత్రమే టి‌డి‌పిని గెలిపించగలిగారు.

అటు వినుకొండలో జి‌వి ఆంజనేయులు, గురజాలలో యరపతినేని రెండేసి చొప్పున ఎం‌పి‌టి‌సిలని మాత్రమే గెలిపించారు. పర్చూరులో ఏలూరి సాంబశివరావు, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్‌లు కూడా సత్తా చాటలేకపోయారు. అంటే ఎక్కడకక్కడే కమ్మ నేతలకు కమ్మని షాకులు తగిలాయి. జగన్ దెబ్బకు కమ్మ నేతలంతా చేతులెత్తేశారు. మరి ఈ కమ్మ నేతలు వచ్చే ఎన్నికల్లోపు పికప్ అవుతారో లేదో చూడాలి. ఏదేమైనా జగన్ టి‌డి‌పిలోని కమ్మ నేతలకు బాగానే చెక్ పెట్టారని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: