కేంద్ర ప్రభుత్వం 1998 లో కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకాన్ని ప్రారంభించింది, ఇది రైతులకు స్వల్పకాలిక అధికారిక క్రెడిట్ అందించడానికి సహాయపడుతుంది. ఈ పథకాన్ని మొదట నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) రూపొందించింది. ఇప్పటి వరకు 2 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారని, వారికి కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చామని సెప్టెంబర్ 28 న ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా తెలియ చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డును PM కిసాన్ యోజనకు లింక్ చేసిన తరువాత, రైతులు ఇప్పుడు 4% వడ్డీతో రూ. 3 లక్షల వరకు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఒక ప్రకటనలో, PIB, "కరోనా సమయంలో 2 కోట్లకు పైగా కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయబడ్డాయి, వాటిలో ఎక్కువ భాగం చిన్న రైతులకు ఇవ్వబడ్డాయి. అలాంటి రైతులు దేశంలో వస్తున్న వ్యవసాయ మౌలిక సదుపాయాలు మరియు కనెక్టివిటీ మౌలిక సదుపాయాల ద్వారా ప్రయోజనం పొందుతారు."

 కిసాన్ క్రెడిట్ కార్డుల ప్రయోజనాలు..

కిసాన్ క్రెడిట్ కార్డులు రైతులకు బ్యాంకుల అధిక వడ్డీని నివారించడంలో సహాయపడతాయి, ఎందుకంటే KCC(kisaan credit card)వడ్డీ రేటు 2%నుండి ప్రారంభమవుతుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం సులభం. sbi యొక్క ఆన్‌లైన్ సేవ KCC(kisaan credit card)సమీక్షను సులభతరం చేయడానికి సహాయపడుతుంది.

దీని గురించి మాట్లాడుతూ, sbi సోషల్ మీడియా వేదికగా తెలియ చేసింది, "YONO కృషి ప్లాట్‌ఫామ్‌లో KCC రివ్యూ ఫీచర్‌ని సులభతరం చేయడం ద్వారా రైతులను శక్తివంతం చేయడం! sbi రైతు కస్టమర్‌లు ఇప్పుడు బ్రాంచ్‌ను సందర్శించకుండా KCC సమీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, sbi YONO యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి."అని తెలిపింది.


కిసాన్ క్రెడిట్ కార్డులని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి దశలు..

దశ 1: 'SBI YONO' యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.

దశ 2: వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి - https://www.sbiyono.sbi/index.html

దశ 3: 'YONO Krishi' కి వెళ్లండి.

దశ 4: 'khata'కి వెళ్లండి.

దశ 5: KCC సమీక్ష విభాగానికి వెళ్లండి.

దశ 6: అప్లై మీద క్లిక్ చేసి డ్యూ ప్రాసెస్ పూర్తి చేయండి

మరింత సమాచారం తెలుసుకోండి: