చైనా ఒకపక్క పాకిస్తాన్ మరియు తాలిబన్ ఆఫ్ఘన్ తో కలిసి నడుస్తూనే ఉంది. అలాగే తాలిబన్ ల దేశాన్ని గుర్తించాలని తీవ్రంగానే ప్రయత్నించింది చైనా. అలాగని ఇవన్నీ తాలిబన్ ల కోసం చేసినవేమి కాదు, చైనా అలా ఎప్పుడు చేయదు. స్వప్రయోగాజనాల కోసం తప్ప మరోకరి ప్రయోజనం దానికి మొదటి నుండి పట్టదు. అవసరం అనుకుంటే హత్తుకుంటుంది, అప్పులు ఇస్తుంది, ఆ అవసరం తీరితే అప్పు తీర్చలేదని దేశాన్నే స్వాధీనం చేయమంటుంది. అది మొదటి నుండి చైనా మిగిలిన వారితో చేసే స్నేహానికి అర్ధం. అలాంటిది తాజాగా కాబుల్ మసీదులో జరిగిన పేలుళ్లలో ఆ దేశానికి చెందిన తీవ్రవాది కూడా ఉండటం పెద్దగా చైనాను ఆశ్చర్యానికి గురిచేయలేదు. పాక్ తో నడుస్తున్నప్పుడే ఆ దేశంలో ఉన్న తీవ్రవాదులతో తిరగడం కూడా చైనా అలవాటు చేసుకుంది, వీలైతే వాళ్ళని కూడా తన పనులకు వాడుకుంది. అలా ఉంది కనుక తన పౌరులు కూడా తీవ్రవాదులు అయ్యే అవకాశాలు ఉన్నాయని చైనా ఊహించకుండా ఉంటుందా, అందుకే పెద్దగా ఆశ్చర్యానికి గురికాలేదు.

అయినా చైనానే ఆశ్చర్యానికి గురిచేసిన అంశం ఏమిటంటే, తన దేశంలోనే తీవ్రవాదులు తనకు తెలియకుండానే ఒక స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. అది తాజాగా సాటిలైట్ ఫోటోల ద్వారా కనుక్కున్నారు. దీనితో చైనా ఆశ్చర్యానికి గురికాక తప్పలేదు. చైనా, పాక్ పెంచి పోషించిన తీవ్రవాదులు ఇప్పుడు వాటిమీదే విషం చిమ్మడం మొదలు పెడుతున్నాయి. అంటే త్వరలో చైనా కూడా తీవ్రవాద దేశం గా తాలిబన్ లేదా ఐఎస్ ఆక్రమించే అవకాశాలు ఎక్కవులాగానే ఉన్నాయి. చైనా పౌరులు కూడా ఇప్పటికే తీవ్రవాదంపై మళ్లుతున్న విషయం కాబుల్ మసీదు బాంబు పేలుళ్ల ఘటనతో అర్ధం అయ్యింది.

ఇక తీవ్రవాదులు చైనా కు తెలియకుండా తజికిస్తాన్, ఖజకిస్థాన్ ప్రాంతాలలో తమ స్థావరం ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ నుండి చాలా లో తీవ్రవాద కార్యకలాపాలు చేపడుతున్నారు. వారి పౌరులకు అక్కడే శిక్షణ లాంటివి కూడా ఇస్తున్నారు. తమ అవసరాలకు తగ్గట్టుగా వారిని కూడా ఐఎస్ మానవ బాంబులుగా మారుస్తుంది. ఈ విధంగా చుస్తే ఇప్పటికే ఆఫ్ఘన్, పాక్, ఇప్పుడు చైనా మొత్తం మూడు తీవ్రవాద దేశాలు ప్రపంచంలో ఉన్నట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: