గత కొన్ని రోజుల నుంచి ఏపీ లోని పలు ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయ్ అనే చెప్పాలి.. ఈ క్రమంలోనే ఏ క్షణం ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అని ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అయితే ఇటీవల మరోసారి ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. తమిళనాడు దక్షిణ కోస్తా తీరాల మధ్య పుదుచ్చేరి చెన్నై సమీపంలోని వాయుగుండం తీరం దాటింది అన్న విషయాన్ని వెల్లడించారు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు.


 తెల్లవారుజామున మూడు గంటల నుంచి 4 గంటల మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇక ఈ వాయుగుండం ప్రభావంతో ఈ రోజు రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా  తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.



 ఈ క్రమంలోనే ఇక ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిర్వహణ శాఖ మంత్రి కన్నబాబు ఆదేశాలు జారీ చేశారు. సహాయ చర్యల కోసం చిత్తూరు కడప నెల్లూరు లకు ఎన్ డి ఆర్ ఎఫ్..ఎస్ టి ఆర్ ఎఫ్ బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టడం మొదలుపెట్టారు. ఇక మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు విపత్తుల శాఖ మంత్రి కన్నబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: