ఏపీ సీఎం జ‌గ‌న్ వైపే జ‌నం ఉన్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు.. సీమ ప్రాంత వాసులు. ఇటీవ‌ల ఇక్క డ భారీ వ‌ర‌ద‌లు రావ‌డంతో నెల్లూరు, క‌డ‌ప జిల్లాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. అదేస‌మ‌యంలో చిత్తూరు లోనూ.. ప్ర‌జ‌లు క‌ట్టుబ‌ట్ట‌ల‌తో మిగిలారు. దీనిని రాజ‌కీయంగా త‌న‌కు అనుకూలం చేసుకునేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌.. వ‌రుస పెట్టి.. క‌డ‌ప‌, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్య‌టించారు. జ‌గ‌న్ హెలికాప్ట‌ర్‌లో వ‌చ్చి చ‌క్క‌ర్లు కొట్టార‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను ఆదుకోలేద‌ని.. ఇప్ప‌టికీ.. ఇక్క‌డి ప్ర‌జ‌లు క‌ట్టుబ‌ట్ట‌ల‌తో రోడ్డుపైనే ఉన్నార‌ని.. చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు.

ఇక‌, చంద్ర‌బాబు అనుకూల మీడియా.. భారీ ఎత్తున ప్ర‌చారం చేసింది. క‌ట్ చేస్తే.. ఏపీ సీఎం జ‌గ‌న్ అసెంబ్లీ సాక్షిగా..  వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఏం చేసిందీ.. వివ‌రించారు. ఎక్క‌డెక్క‌డ ఎలా ఆదుకున్న‌దీ.. గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రించారు. అంతేకాదు.. చంద్ర‌బాబు ఎవ‌రికైతే.. సాయం అంద‌లేద‌ని.. ప్ర‌ధానంగా పేర్కొన్నారో.. ఎవ‌రి పేరును ఆయ‌న బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారో.. అదే పేరుతో జ‌గ‌న్ కూడా వ్యాఖ్యానించా రు. స‌ద‌రు మ‌హిళ‌కు తాము ఏం చేశారో.. ర‌సీదుల‌తో స‌హా స‌భ‌లో వివ‌రించారు. దీంతో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు దీనికి కౌంట‌ర్ ఇవ్వ‌లేక పోయారు.

ఇక‌, చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు.. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో.. తీవ్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొన‌లేద‌ని.. సాక్షాత్తూ.. బాబు అనుకూల మీడియాలోనే పేర్కొన్నారు. ఈ ప‌రిణామం.. టీడీపీకి ఇబ్బందిగా మారింది. పైగా ఓ వ‌ర్గం మీడియా బాధిత ప్రాంతాల్లో ఏం జ‌రుగుతోందో చెప్ప‌డం మానేసింది. అంటే.. అక్క‌డ అంతా స‌వ్యంగా సాగుతున్న‌ట్టే క‌దా! దీంతో టీడీపీ నేత‌లు.. ఇప్పుడు విష‌యం లేక‌.. విస్తుపోతున్నారు. అంతా బాగానే ఉంటే.. ఇప్పుడు ఏం చేయాల‌ని వారు త‌ల ప‌ట్టుకుంటున్నారు.

అంతేకాదు.. బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించినా.. టీడీపీ ఏం ఇస్తుందంటూ..కొంద‌రు ప్ర‌శ్నించిన విష‌యాన్ని.. కిందిస్థాయి నాయ‌కులు చంద్ర‌బాబు దృష్టికి తెచ్చారు. దీంతో ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా.. సాయం చేయాల‌ని ఆయ‌న ఆదేశించారు. మొత్తంగా చూస్తే.. చంద్ర‌బాబు ఇరికించాల‌ని అనుకుని.. త‌నే ఇరుక్కున్నారా? అనే కామెంట్లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: