కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా ఎంతగానో సతమతమయ్యింది. రెండేళ్లు మనమంతా నరకం అంటే ఏంటో చూశాం. కళ్ల ముందే తమ బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు మరణిస్తుంటే కనీసం చివరి చూపు కూడా చూసేందుకు లేని దుస్థితి. దీని కారణంగా ఎందరో అభం శుభం తెలియని చిన్నారులు అనాధలైపోయారు. అంతటి విద్వంసాన్ని సృష్టించింది కరోనా వైరస్. ఈ మహమ్మారి నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాం అని ఊపిరి పీల్చుకునే లోపు మరో కొత్త వేరియంట్ అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. సౌత్ ఆఫ్రికాలో మొదలయిన ఓమిక్రాన్ వేరియంట్ మన దేశం లోకి ఎంటర్ అయి పోయింది.  

ఈ కొత్త రకం వేరియంట్ చాలా ప్రమాదకర మైనది అని వైద్యులు చెబుతున్నారు. అందులోనూ ఇది కరోనా వైరస్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు చెబుతున్నారు. ఈ వేరియంట్ ను పిసిఆర్  పరీక్ష ద్వారా గుర్తించవచ్చు అని తెలుస్తోంది. ఇతర వేరియంట్ల కన్నా చాలా ప్రమాదకరం అని, డెల్టా వేరియంట్ కంటే ఇది ఆరు రెట్లు ప్రమాదమని డాక్టర్లు అంటున్నారు. మరి కొందరు వైద్యులు ఏమో ఇది ప్రాణాంత కారి కాదని చెబుతున్నారు.  ఇక ఇది గర్భిణీ స్త్రీలపై ఎక్కువ ప్రభావం చూపుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో...  ఈ కొత్త రకం వేరియంట్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఇంకొద్ది రోజుల పాటు అధ్యయనం అవసరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మిగిలిన వారితో పోలిస్తే గర్భిణీ స్త్రీలు కాస్త ఎక్కువ గానే జాగ్రత్తలు వహించాలని నిబంధనలు పాటించాలి డాక్టర్లు సూచిస్తున్నారు. చిన్న మార్పు, లేదా లక్షణం కనిపించిన వెంటనే తమ డాక్టర్ ను సంప్రదించి సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. మరి చూద్దాం దీని నుండి మనకు ఎప్పుడు విరక్తి కలుగుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: