తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డికి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించగా రేవంత్ రెడ్డి సమర్థవంతంగా పని చేస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి ఇప్పుడు ఆ పార్టీ నాయకులు కూడా ఇటువంటి క్లారిటీ రావడం లేదు. రాజకీయంగా పార్టీ బలంగా ఉందని ప్రచారం జరుగుతున్న సరే పార్టీలో ఉన్న చాలామంది నాయకులు పార్టీలో ఉత్సాహంగా పని చేయడానికి ముందుకు రాకపోవడం ప్రధానంగా కొంతమంది ఎంపీలు రేవంత్ రెడ్డికి ఏమాత్రం సహకరించక పోవడం అదేవిధంగా నియోజకవర్గాల ఇన్చార్జిలు గాని ఉన్న ఎమ్మెల్యేలు గానీ రేవంత్ రెడ్డి మాట వినకపోవడం గానీ అన్నీ కూడా పార్టీని మరిన్ని సమస్యలలోకి నెడుతున్నారు.

రాజకీయంగా పార్టీ ఇప్పుడు బలోపేతం చేసే దిశగా వెళ్లాలని రేవంత్ రెడ్డి కష్టపడుతున్న సరే చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గాలకు రాకపోవడం అదే విధంగా భారతీయ జనతా పార్టీని గానీ అధికార పార్టీని విమర్శించే ప్రయత్నం చేయకపోవడం ప్రతిపక్ష ఓటు బ్యాంకు మీద సమర్థవంతంగా దృష్టి పెట్టకపోవడం వంటివి రేవంత్ రెడ్డికి కూడా బాగా ఇబ్బందికరంగా మారాయి. అదేవిధంగా జానారెడ్డి లాంటి సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి సహకరించకపోవడం కొంతమంది ఎంపీలు ఎక్కడున్నారో కూడా సమాచారం ఇవ్వడం వంటివి సమస్యగా మారింది.


రేవంత్ రెడ్డి కొంతమంది కీలక నాయకులతో ఇటీవలి కాలంలో సంప్రదింపులు జరిపిన సరే ఎవరు కూడా పార్టీ కోసం పని చేసేందుకు ఆసక్తి చూపించకపోవడం తో ఈ పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి విషయంలో అంత నమ్మకంగా లేరని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో కొన్ని కొన్ని అంశాలలో కాస్త దూకుడుగా ముందుకు వెళ్తున్న సరే పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చే విషయంలో మాత్రం సమర్థవంతంగా వ్యవహరించే లేకపోవడంతో ఇప్పుడు మరో అధ్యక్షుడు ఆలోచన కూడా చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: