అధికారికంగా పొత్తుపై ఎలాంటి క్లారిటీ రాలేదు గానీ...అనధికారికంగా మాత్రం పొత్తు ఫిక్స్ అయినట్లు సమాచారం. పొత్తుపై టీడీపీలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే జనసేనకు కేటాయించే సీట్లపై చంద్రబాబు కూడా క్లారిటీ ఇచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ సీట్లు అయితే జనసేనకు కేటాయించాలని అనుకుంటున్నారో, ఆ సీట్లలో టీడీపీ ఇంచార్జ్‌లని పెట్టడం లేదు....లేదా డమ్మీ ఇంచార్జ్‌లని పెడుతున్నారు. దీని బట్టి చూస్తే జనసేనతో పొత్తు ఉంటుందని అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది.
ఇలా కృష్ణా జిల్లాలో రెండు సీట్లపై బాబు క్లారిటీ ఇవ్వలేదు. జిల్లాలో 16 సీట్లు ఉండగా, 14 సీట్లలో ఇంచార్జ్‌లు ఉన్నారు. కానీ రెండు సీట్లు విషయంలో క్లారిటీ లేకుండా ఉంది. విజయవాడ వెస్ట్, కైకలూరు సీట్లలో ట్విస్ట్‌లు ఉండేలా ఉన్నాయి. 2014లో పొత్తులో భాగంగా ఈ రెండు సీట్లని బీజేపీకి కేటాయించారు. నెక్స్ట్ జనసేనతో పొత్తు ఉంటుంది కాబట్టి, ఆ పార్టీకి ఫిక్స్ చేయొచ్చని తెలుస్తోంది. అందుకే విజయవాడ వెస్ట్‌లో అసలు ఇంచార్జ్‌ని పెట్టలేదు. ఎంపీ కేశినేని నానిని సమన్వయకర్తగా నియమించారు.
అటు కైకలూరు ఇంచార్జ్ పదవి కోసం చాలామంది పోటీ పడుతున్నారు. అయినా ఇంచార్జ్ పదవి ఇవ్వలేదు. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఇంచార్జ్ పదవి కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. కానీ ఆయనకు ఇంకా ఫిక్స్ చేయలేదు. ఈ సీటు కూడా జనసేనకు ఇవ్వడానికే బాబు ఇంచార్జ్‌ని పెట్టడం లేదని తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి