ఒకప్పుడు సోదర దేశాలుగా కొనసాగేవి నేపాల్,భారతదేశం. కానీ ఆ తర్వాత కాలంలో నేపాల్ లో ఉన్న ఓలి శర్మ ప్రభుత్వం అటు చైనా వేసిన ఆర్థిక సహాయం ఉచ్చులో పడిపోయింది. దీంతో సోదర దేశంగా ఉన్న భారత్ను నేపాల్ వ్యతిరేకించడం మొదలుపెట్టింది. అంతేకాకుండా సరిహద్దుల్లో ఎంతగానో ఓవరాక్షన్ చేస్తూ వచ్చింది నేపాల్. నేపాల్ ఎంతలా కవ్వింపులకు పాల్పడినప్పటికీ అటు భారత్ మాత్రం ఎంతో సంయమనంతో  కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత కాలంలో నేపాల్ రాజకీయాలలో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి.


 నేపాల్ ప్రధానమంత్రిగా ఉన్న ఓలి శర్మ తర్వాత కాలంలో బలప్రయోగం చేసుకోవడంలో విఫలంకావడంతో ఇక హోలీ శర్మ ప్రభుత్వం కుప్పకూలి పోయింది. ఆ తర్వాత నేపాలీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే నేపాల్ సరిహద్దుల్లో ఉన్నటువంటి లిప్ లేక్, కాలాపాని ప్రాంతాలు నేపాల్ కి సంబంధించింది అంటూ గతంలో పోలీస్ శర్మ ప్రభుత్వం ఉన్న సమయంలో ఒక మ్యాప్ కూడా విడుదల చేసింది అక్కడి ప్రభుత్వం. అయితే ఇప్పుడు నేపాల్లో నేపాలీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గతంలో నేపాల్ తమదేనంటూ చెప్పిన ప్రాంతాలకు ప్రస్తుతం  మౌలిక వసతులు కల్పించడం మొదలుపెట్టింది భారత్.


 అయితే భారత్ మౌలిక వసతులు కల్పించడం పై ప్రస్తుతం నేపాల్ ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే భారత్ ఎంతో గట్టిగానే జవాబు ఇవ్వడం గమనార్హం. కొత్తగా భౌగోళిక పరిస్థితులు మార్చాలని భారత్ ఎక్కడ అనుకోవడం లేదు. మొదటి నుంచి సరిహద్దులు ఎవరివి ఎక్కడున్నాయని అందరికీ తెలుసు. భారత సరిహద్దు ఎక్కడ వరకు ఉంది అన్నది మీకు మాకు పూర్తిస్థాయి స్పష్టత ఉంది. ఇప్పుడు కొత్తగా వివాదం సృష్టించవద్దు అంటూ భారత ప్రభుత్వం చెప్పింది. చైనా మరోసారి నేపాల్లో కొత్త నాటకానికి తెరలేపారని అనుకున్న సమయంలో భారత్ గట్టి జవాబు ఇవ్వడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: