ఆంధ్రాలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ విపక్షాల మధ్య చాలా ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాగా మరో వారం రోజుల్లో ప్రచారం ముగియనుందనే విషయం అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ ఏపీలో ప్రచారానికి దిగుతున్నారు. జగన్, చంద్రబాబు, పవన్ గురించి ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు. వరుస సభలతో ఓటర్లను తమ వైపు తిప్పుకునే పనిలో ఎప్పుడో పడ్డారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోవాలంటే గుడివాడ ఎమ్మెల్యే నాని గురించి ఇక్కడ తప్పక మాట్లాడుకోవాలి.

అవును, గుడివాడ నుంచి పోటీలో ఉన్న వైసీపీ నేత కొడాలి నాని ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రీ ఎంట్రీ.. పార్టీ నాయకత్వం చేపట్టటం పై కీలక వ్యాఖ్యలు చేసి పెను దుమారాన్ని సృష్టించాడు. గుడ్లవల్లేరు మండలం, వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి కొడాలి నాని హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ... "చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చిత్తుచిత్తుగా ఓడిస్తేనే.. జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి ఆ పార్టీ వస్తుంది.  సీనియర్ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నేతలు.. పార్టీని కాపాడుకునేందుకు జూ.ఎన్టీఆర్ కాళ్ల దగ్గరకు వస్తారన్నారు. టీడీపీ మద్దతు సోషల్ మీడియాతో జూనియర్ ఎన్టీఆర్ తిట్టిపోయిస్తున్నారు!" అని గట్టిగా చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా నాని.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ పార్టీ గౌడ, మత్స్యకార, యాదవ, ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించిందని.. ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదని, కనీసం వారికి సీట్లు కూడా కేటాయించలేదన్నారు. అదే సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాకుండా రాజ్యసభ స్థానాలు ఇస్తూ..ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో మెజార్టీ స్థానాలు వారికే కేటాయించారని గుర్తు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ సందర్భంగా కొడాలి నానికి మద్దతు ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: