దొరసాని సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యి ఆ తర్వాత అనేక సినిమాలలో నటించి అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకున్న ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం గం గం గణేశా అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. 

ఈ చిత్ర షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయ్యి ఇప్పటికే ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అయింది. ఈ మూవీ నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ ని మే 31 వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్లు. చిత్ర బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ప్రచారాల జోరును పెంచారు.

అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ వారు ఈ సినిమా యొక్క రెండవ పాట విడుదల తేదీని , టైమ్ ను తాజాగా విడుదల చేశారు. ఈ మూవీ లోని రెండవ సాంగ్ అయినటువంటి పిచ్చిగా నచ్చాసవే అంటూ సాగే పాటను ఈ రోజు అనగా మే 4 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 06 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ లోని మొదటి పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. మరి పిచ్చిగా నచ్చేసావే అంటూ సాగే ఈ రెండవ సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ad