బీహార్‌లోని గయా జిల్లాలో ఉద్రిక్త  వాతావ‌ర‌ణ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రైల్వే ఉద్యోగ నియామక  కోసం నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో అవకతవకలు చోటుచేసుకున్న‌ట్టు ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో..  ప‌లువురు రైళ్లకు నిప్పుపెట్టారు. రైల్వే రిక్రూట్‌మెఎంట్ బోర్డు పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆందోళన చేప‌ట్టారు ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థులు.

 ఆ ఆందోళ‌న అనేది  హింసాత్మకంగా మారిన‌ది. బీహార్‌లోని గ‌యా రైల్వే స్టేషన్‌లో రెండు రైళ్లకు నిప్పు పెట్టడంతో పాటు ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.  ఒక గూడ్సు రైలు, ఒక ప్యాసింజర్‌ రైలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆందోళన చేస్తున్న వారిని అక్కడ నుంచి పంపించేందుకు టియర్ గ్యాస్ పోలీసులు షెల్స్‌ను ప్రయోగించారు. కానీ దాదాపు 10 వేల మంది ఈ ఆందోళనలో  పాల్గొన్నారని పేర్కొంటున్నారు అధికారులు.  ఆగ్రహంతో ఉన్న నిరుద్యోగులను తప్పుదోవ పట్టించవద్దని  గయా సీనియర్ ఎస్పీ ఆదిత్య కుమార్  కోరారు.

ఈ ఘటనపై రైల్వే శాఖ కమిటీని ఏర్పాటు చేసిన‌దని.. బాధ్యులైన వారిని గుర్తించి  వెంట‌నే చర్యలు తీసుకుంటామని చెప్పారు.  అయితే అనర్హులను రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు కొంత‌మంది విద్యార్థులు. ఇటీవల వెల్లడించిన పరీక్షా ఫలితాలు, రిక్రూట్‌మెంట్ నిబంధనల్లో మార్పులపై చాలామంది అభ్యర్థులు ఆగ్రహం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు.

అందుకే ఇలాంటి హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు అధికారులు. పాట్నా, భోజ్‌పూర్, నవాడా, సీతామర్హి, నలంద సహా బీహార్‌లోని పలు జిల్లాల్లో భారీ నిరసన ప్రదర్శనలు నిర్వ‌హించారు. ఈ ఆందోళనలలో  కొందరు ప్రభుత్వ ఆస్తులను సైతం  ధ్వంసం చేసారు. దీంతో విద్యార్థులను అదుపు చేయడానికి  పోలీసులు తీవ్రంగా శ్ర‌మించాల్సి వ‌చ్చింది. నిరసనల్లో హింస చెలరేగడంతో రైల్వేశాఖ ఎన్‌టీపీసీ సహా మరికొన్ని   ఎంట్రెన్స్ ప‌రీక్ష‌ల‌ను  తాత్కాలికంగా నిలిపేసింది. అటు ఈ అవకతవకలపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ తో పాటు ప‌లువురు మండిప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: