ఇవాళ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎవ‌రు వెళ్తారు? ప్ర‌ధాని మోడీని ఎవ‌రు స్వాగ‌తిస్తారు? ఈ రెండు ప్ర‌శ్న‌లే ప్ర‌ధానంగా వేధిస్తున్నాయి.బ‌డ్జెట్ కేటాయింపుల త‌రువాత కేంద్రంపై ఓ రేంజ్ లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కేసీఆర్ త‌రువాత అదే పంథాలో మాట్లాడుతూ వ‌స్తుండ‌డంతో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పీఎంతో స‌ఖ్యంగా మెలిగితే రాజ‌కీయంగా ఇబ్బందే అని భావిస్తున్నారా లేకా ముందే నిర్ణ‌యించిన మేర‌కు బీజేపీతో దూరం దూరం ఉండాల‌ని అనుకోవ‌డంతోనే సీన్ లోకి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ను తీసుకు వ‌చ్చారా అన్న‌ది ఓ పెద్ద సందిగ్ధంగా ఉంది.

రాజ‌కీయంగా ప‌రిణామాల్లో మార్పు అన్న‌ది ఏవిధంగా ఉన్న‌ప్ప‌టికీ ఇవాళ స‌మ‌తామూర్తి విశిష్టాద్వైత సిద్ధాంత క‌ర్త జ‌గ‌ద్గురు రామానుజాచార్యుల విగ్ర‌హాన్ని జాతికి అంకితం చేసేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హైద్ర‌బాద్ కు వ‌స్తున్నారు.భాగ్య‌న‌గ‌రి శివారున ముచ్తింత‌ల్ కు వెళ్లి  జియ‌రు స్వామి ఆశ్ర‌మంలో దాదాపు ఐదు నుంచి ఆరుగంటల పాటు ఇక్క‌డే గ‌డ‌పబోతున్నారు. ఇదే స‌మ‌యంలో అక్క‌డి య‌జ్ఞ యాగాదుల్లోనూ పాల్గొన‌నున్నారు.తొలుత ఇక్రిశాట్ స‌ర్ణోత్స‌వ సంరంభానికి హాజర‌యి త‌రువాత హెలికాప్ట‌ర్ లో ముచ్తింత‌ల్ కు చేరుకోనున్నారు.ఈ రెండూ ఆయ‌న‌కు ముఖ్య‌మైన వేడుక‌లే!


ప్ర‌ధాని రాక నేప‌థ్యంలో ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికేందుకు తాను వెళ్ల‌బోన‌ని తేల్చేశారు సీఎం కేసీఆర్. క్యాబినెట్ త‌ర‌ఫున మంత్రి త‌ల‌సాని హాజ‌రు కానున్నార‌ని, ఆయ‌నే వెళ్లి ఎయిర్ పోర్టులో ప్ర‌ధానిని స్వాగ‌తిస్తార‌ని అంటున్నారు.దీంతో కేసీఆర్ కు, మోడీకి మ‌ధ్య దూరం పెరిగిన కార‌ణంగానే ఈ విధంగా జ‌ర‌గుతుంద‌ని ప‌లువురు సోష‌ల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు.వీటిని గులాబీ శ్రేణులు ఖండిస్తున్నా కేసీఆర్ మాత్రం ట్రోల్ అవుతూనే ఉన్నారు. బ‌డ్జెట్ కేటాయింపుల్లో అస‌మాన‌త‌ల‌తో పాటు
రాష్ట్రాల స‌మాఖ్య స్ఫూర్తి కూడా దెబ్బ‌తీస్తున్నారన్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో కేంద్రంతో పోరు తీవ్రం చేసి త‌ద్వారా జాతీయ నాయ‌కుల్లో  కూడా గుర్తింపు తెచ్చుకోవాల‌ని ప‌రిత‌పిస్తున్నారు కేసీఆర్. మ‌రి! ఆయ‌న త‌ప‌న నిజం అవుతుందో లేదో అన్న‌ది
చూడాలిక.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp