ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా గురించి తలచుకుంటేనే గుండె జళ్ళుమంటుంది. మరి ఈ మహమ్మారి సృష్టించిన కల్లోలం అలాంటిది. ఇప్పటికీ ఈ భూమిని పూర్తిగా వదలకుండా మనల్ని టెన్షన్ పెడుతూనే ఉంది. ఎన్నో లక్షల మంది ఈ కరోనా కాటుకు బలయ్యారు. కుప్పలు తెప్పలుగా కరోనా బాధితుల శవాల దిబ్బలు మనసుల్ని చిదిమేసాయి. ఓ వైపు తమ వారి ప్రాణాలను తీసుకున్న ఈ మాయదారి వైరస్ వారి కుటుంబ సభ్యులకు తమ వారి ఆఖరి చూపు కూడా నోచుకోకుండా చేసిన ఘటనలు ఎప్పటికీ మరువలేము. అందరూ ఉన్నా కూడా ఈ వైరస్ భయంతో అనాధ శవాలుగా తమ వారిని వదిలేసిన దుస్తితి అతి బాధాకరమైన అంశం.

ఇదిలా ఉండగా కరోనా కారణంగా మన భారత దేశంలో మొత్తంగా 40 లక్షల కరోనా మరణాలు సంభవించాయి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్.వో) చేసిన ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం ఫైర్ అయ్యింది. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్యను లెక్కించడానికి డబ్ల్యూహెచ్.వో అనుసరించిన విధానాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఖండిస్తూ ప్రశ్నించింది. జనాభాలో విస్తీర్ణంలో ఇంత పెద్ద దేశానికి ఒక గణిత నమూనాను ఫాలో కావడాన్ని తప్పు పడుతూ విమర్శించింది. తక్కువ జనసాంద్రత ఉన్న దేశాలకు అనుసరించిన విధానాన్నే అధిక జనాభా కలిగిన పెద్ద దేశం భారత్ విషయంలోనూ అదే విధానాన్ని పాటించడం కరెక్ట్ కాదంటూ వ్యాఖ్యానించింది. ఈ విషయంలో మరో సారి దృష్టి పెట్టాలని సూచించింది.

కరోనా మరణాలను బహిర్గతం చేసే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నాలను భారత్ అడ్డుకుంటోందంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో.... ఈ న్యూస్ పై  భారత ప్రభుత్వం స్పందించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు గణాంకాల గురించి డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసిన క్రమంలో.. భారత్ లోనూ మరణాలు కనీసం 40 లక్షలు ఉంటాయని లెక్కగట్టింది... అయితే ఇక్కడ డబ్లూ.హెచ్.వో గణాంకాలను తప్పు పట్టడం లేదని..ఈ గణాంకాలను అనుసరించిన విధానం సరికాదని మాత్రమే అన్నామని వెల్లడించింది  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ.

మరింత సమాచారం తెలుసుకోండి: