ఈ క్రమంలోనే కాశ్మీర్లో మళ్లీ పరిస్థితులు భయం భయంగానే మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే భారత సైన్యం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ భారత్ లోకి అక్రమంగా చొరబడిన ముష్కరులను ఎన్ కౌంటర్ చేస్తూ హతమారుస్తూనే ఉన్నారు. గత కొంతకాలం నుంచి వందల సంఖ్యలో ఉగ్రవాదులను భారత సైన్యం మట్టు బెట్టింది. ఇకపోతే ఈ నెల 2వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని కుల్గామ్ జిల్లా లో బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్ ను ఒక తీవ్రవాది దారుణంగా కాల్చి చంపడం సంచలనంగా మారిపోయింది.
ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి ఇక ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టిన భారత సైన్యం క్రమక్రమంగా ఎంతోమంది ముష్కరులను మట్టు పెడుతూనే ఉంది. ఇకపోతే ఇటీవల బ్యాంకు మేనేజర్ ను కాల్చిచంపిన తీవ్రవాదిని భద్రతా బలగాలు అంతమొందించాయ్ అన్నది తెలుస్తుంది. పోషియన్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారు అంటూ కాశ్మీర్ ఐజి విజయ్ కుమార్ తెలిపారు. ఇక వారిద్దరూ కూడా లష్కరే తోయిబాకు చెందిన వారే అని తెలిపారు. ఇక అందులో ఒకరు జాన్ మొహమ్మద్ లోన్ అని.. అతనే బ్యాంకు మేనేజర్ ని కాల్చి చంపాడని పేర్కొన్నారు. ఇక మరో ఉగ్రవాదిని గుర్తించాల్సి ఉందన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి