వచ్చే ఎన్నికల్లో జనసేనకు భారీఓటింగ్ ఖాయమంటున్నారు. ఒకపుడంటే ప్రజారాజ్యంపార్టీ ప్రభావం కారణంగా ఓటింగ్ సరిగారాలేదట. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం జనాలు జనసేన వైపు మళ్ళటం ఖాయమని మెగా అభిమానులు అంచనా వేస్తున్నారు. ఒక టీవీ చర్చా కార్యక్రమంలో మెగా అభిమానుల సంఘంలో కీలక వ్యక్తి మాట్లాడుతు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై జనాల్లో ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయినట్లు చెప్పారు.





వచ్చే ఎన్నికల్లో ఎంతమంది ఎన్నిరకాలుగా అడ్డుపడినా కోస్తా జిల్లాల్లో 70 శాతం జనసేకు ఓటింగ్ ఖాయమన్నారు. అలాగే రాయలసీమలో 50-60 శాతం ఓటింగ్ మొగ్గు తప్పదంటున్నారు. ఇంతభారీ ఓటింగ్ శాతం ఎలా వస్తుందన్న ప్రశ్నకు మాత్రం సదరు వ్యక్తిదగ్గర సమాధానంలేదు. కోస్తా జిల్లాల్లో 70 శాతం, రాయలసీమ జిల్లాల్లో 60 శాతం ఓటింగ్ అంటే మామూలు విషయంకాదు. అసలు ఏమిచూసి జనసేనకు జనాలు ఓట్లేస్తారని అనుకుంటున్నారో అర్ధం కావటంలేదు.





పోయిన ఎన్నికల్లో జనసేనకు సుమారు 5 శాతం ఓటింగ్ వచ్చింది. తాజా రాజకీయ పరిణామాలను బట్టి వచ్చే ఎన్నికల్లో జనసేనకు మరికాస్త ఓటింగ్ పెరగుతుందని అందరు అంచనా వేస్తున్నారు. అదికూడా ఉభయగోదావరి జిల్లాల్లో పెరుగుతుందనే అంచనాలున్నాయి. అంతేకానీ కోస్త, రాయలసీమ జిల్లాల్లో మెగా అభిమానులు చెప్పుకుంటున్నట్లు భారీ ఓటింగుకు అవకాశం కనబడటంలేదు. పైగా జనసేన ఒంటరిగా పోటీచేస్తుందా లేకపోతే బీజేపీతోనే అదీకాకపోతే తెలుగుదేశంపార్టీతో పొత్తుంటుందా అనే విషయంలో క్లారిటిలేదు.






జనసేన ఒంటరిగా పోటీచేస్తే అభ్యర్ధులతో పాటు నిధుల కూడా చాలాపెద్ద సమస్యే. అదే టీడీపీతో పొత్తుపెట్టుకుంటే అభ్యర్ధులతో పాటు నిధులను కూడా చంద్రబాబునాయుడే సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి. ఒంటరిగానా లేకపోతే పొత్తులో పోటీచేయాలా ? అని పవన్ డిసైడ్ చేయటంబట్టి రాజకీయ పరిణామాలుంటాయి. కొన్నిజిల్లాల నుండి అందుతున్న ఫీడ్ బ్యాక్ ప్రకారం చూస్తే జనసేన ఒంటరిగా పోటీచేస్తేనే ఓట్లశాతం పెరిగుతుందట. ఇదే సమయంలో గెలుపు కష్టమనే అంటున్నారు. ఇదే సమయంలో టీడీపీతో పొత్తుంటే కొన్ని లాభాలు కూడా ఉంటాయి. మరి పవన్ ఏమిచేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: