ఇటీవల కాలంలో అయితే పిల్లలు బాగా చదువుకునేందుకు ఏకంగా వారితో పాటుగానే తల్లిదండ్రులు కూడా చదువుతూ.. ఇక తమ పిల్లల్లో మరింత ఏకాగ్రత పెంచేందుకు ప్రయత్నిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న గవర్నమెంట్ జాబ్ కోసం కొడుకు చదువుతూ ఉండగా కొడుకుతో పాటు చదివిన తల్లి కూడా గవర్నమెంట్ జాబ్ సాధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక మరో ఘటనలో కూతురుతో పాటు తల్లి కూడా ఫస్ట్ క్లాస్ క్లాసులో పాస్ అవడం లాంటి ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఇప్పుడు ఇలాంటిదే మరొకటి వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.
ఒక ఆటో డ్రైవర్ తన కూతురు యూపీఎస్సీ ఎగ్జామ్ పాస్ అయ్యేందుకు.. మంచి ర్యాంక్ సాధించేందుకు ఇక అతను కూడా కష్టపడి పోతున్నాడు. తన కూతుర్ని ప్రశ్నలు అడిగేందుకు యూపీఎస్సీ ఎగ్జామ్ సిలబస్ను ప్రిపేర్ అవుతున్నాడు ఆటో డ్రైవర్. ఒక వ్యక్తి ఊబర్లో ఆటో బుక్ చేసుకున్నాడు. అతను ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఆటో డ్రైవర్ తన ముందు యూట్యూబ్లో కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియో చూస్తూ ఆటో నడుపుతున్నాడు. ఇదేంటని ప్రశ్నిస్తే తన కూతురు సివిల్స్ కి ప్రిపేర్ అవుతుందని.. ఈరోజు సాయంత్రం ఈ టాపిక్ పై తన కూతురిని ప్రశ్నలు అడిగేందుకు తాను కూడా ప్రిపేర్ అవుతున్నాను అంటూ సదరు వ్యక్తి చెప్పిన సమాధానం ఆటోలో ఉన్న ప్రయాణికుడిని ఆశ్చర్యానికి గురిచేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి