మొన్నటివరకు దేశ వ్యాప్తంగా మొన్నటివరకు భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే..ఇప్పటికీ వరదలు తగ్గలేదు.ఇంకా కొన్ని ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి.ఆ వర్షాల నుంచి ఇంకా బయట పడక ముందే ఇప్పుడు మరో వార్తను అధికారులు తెలిపారు. బంగాళాఖాతం మీదుగా దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో ఈశాన్య గాలులు ఏర్పడే అవకాశం ఉంది. పూర్తి దక్షిణ ద్వీపకల్ప భారతదేశం అంతటా ఈశాన్య రుతుపవనాల ప్రభావము వలన దాదాపు 29 అక్టోబర్, 2022 నుండి ఆగ్నేయ ద్వీపకల్ప భారతదేశం నందు భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు..
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తర తమిళనాడు తీరంలో సగటు సముద్రంపై 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీ మధ్యఉండి కొనసాగుతున్నది. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి సముద్ర మట్టానికి సగటు 0.9 కి మీ ఎత్తు వద్ద ఉన్నది ఇపుడు బలహీన పడినది. ఈ నేపథ్యంలో ఏపీలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు చేసింది..
ఏ ప్రాంతంలో ఎంత వర్షం నమోదు అవుతుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం: ఈరోజు, రేపు, ఎల్లుండి( అక్టోబర్ 29వ తేదీ) పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉన్నది.దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్: ఈరోజు పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉన్నది. రేపు , ఎల్లుండి ( అక్టోబర్ 29వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా చోట్ల కురిసే అవకాశముంది.రాయలసీమ: ఈరోజు పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉన్నది. రేపు, ఎల్లుండి ( అక్టోబర్ 29వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా చోట్ల కురిసే అవకాశముంది.ఏది ఏమైనా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి