ఈ ఏడాది ప్రముఖ నగరాలను భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దేశంలో ఇప్పుడు వరుసగా గ్యాప్ లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. ఏపీ తో పాటు తమిళనాట కూడా భారీ వర్షాలు ముంచెస్తున్నాయి. గత మూడు రోజులు గా తెరిపినివ్వకుండా కురుస్తున్న వర్షాలు తమిళనాడు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. గత మూడు దశాబ్దాల్లో కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు తమిళనాడులో భీభత్సం సృష్టిస్తున్నాయి. నీల్‌గిరి, కరూర్‌, కడలూర్‌, అరియాలూర్‌, తిరువారూర్‌, తంజావూర్‌ల లో వాతావరణ శాఖ ఆరెంజ్‌ ఎలర్ట్‌ జారీచేసింది.


చెన్నై, నీల్‌గిరి, కోయంబత్తూర్‌, తిరుప్పార్‌, దిండిగల్‌, తేనిల్లో ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడు లో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యం గా చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, డెల్టా జిల్లా ల్లో తెల్లవారు జామున వర్షం కురుస్తోంది. కుండ పోత వర్షాలకు తమిళనాడు లోని జలాశయాలు నిండకుండని తలపిస్తున్నాయి. వాగులూ, వంకలూ పొంగి పొర్లుతున్నాయి. 


తమిళనాడు లో మూడు జిల్లాల్లో రికార్డు స్థాయి లో వర్షపాతం నమోదైంది. కాంచీపురం లో…21 సెంటి మీటర్లు , చెన్నై అవడిలో.. 18 సెంటమీటర్లు వర్షపాతం నమోదైంది. ఒక్కసారిగా అధికారులు అప్రమత్తం అయ్యారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో తక్షణ రక్షణ చర్యలకై ఆదేశించారు. ఇక తమిళనాడులో భారీ వర్షాల కు విద్యావ్యవస్థ అస్తవ్యస్తం అయ్యింది. పలు ప్రాంతాల్లో విద్యాలయాలకు సెలవులు ప్రకటించారు. చెన్నై, పుదుచ్చేరిలలో నాలుగు, ఐదు తేదీల్లో సైతం పాఠశాలల కు సెలవులు డిక్లేర్‌ చేసింది తమిళనాడు స్టేట్‌ గవర్నమెంట్. కాలేజీల కు కూడా సెలవులు ప్రకటించింది. లొతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం గా ఉండాల ని అధికారులు హెచ్చరిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: