సినిమా ప్రారంభానికి ముందు పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం అనే సందేశం వస్తుంది. ఎందుకుంటే దీనిని చూసి కొంతమందైనా ఈ మత్తు బానిస నుంచి బయట పడతారని. కానీ ఈ సందేశం ఆ పేర్లు పడేవరకే. మళ్లీ సినిమాలో యథావిధిగా వీటి వినియోగం విచ్చలవిడిగా ఉంటుంది. హీరోయిజం కోసం సిగిరెట్లు పట్టుకొని చాలా స్టైల్ కాల్చుతూ ఉంటారు. వీటిని చూసి యువత అనుసరిస్తున్నారు అనేది కొంత మేరకు నిజం.


అయితే నటీనటుల సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా వీటిని వినియోగిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా  పట్టుబడుతున్నారు. సినిమా రంగానికి, డ్రగ్స్‌కి  సంబంధం మరింత బయటపడుతుంది. తాజాగా డ్రగ్స్ కేసులో మాదాపూర్ పోలీసులు దర్శకుడు మంతెన వాసువర్మ, సినీ రచయిత మన్నేరు పృథ్వీకృష్ణ ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున విదేశీ మద్యం, గంజాయి, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.  ముంబయికి చెందిన ఈవెంట్ నిర్వహకులు రాహుల్, అశోక్ వద్ద వీరు డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిసింది.  


రాయదుర్గం పోలీసులు డ్రగ్స్ కేసులో నిర్మాత కేవీ చౌదరి ని జూన్ లో అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన విషయాలు పోలీసులు గోప్యంగా ఉంచారు. ఇదే కేసులో పలువురు నిర్మాతలు, యువ  హీరోలు, దర్శకులు అరెస్టు అవడం కలకలం రేపుతోంది.


ఇప్పటికే ఈ కేసులో హీరో నవదీప్ ను నార్కొటెక్ పోలీసులు ఆరుగంటల పాటు విచారించి పలు కీలక ఆధారాలు సేకరించారు. విచారణకు హాజరయ్యే ముందు అతను తన ఫోన్‌ను ఫార్మాట్ చేశాడని తెలిసింది. అయితే ఫోన్ కాల్ ఆధారంగా 81 మంది అనుమానితులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. నిర్మాత వెంకట రత్నా రెడ్డి, రవి ఉప్పలపాటి, కలహర్ రెడ్డి తో పాటు 50మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కీలక ఆధారాలు రాబట్టారు. కలహర్రెడ్డి నోరు విప్పితే టాలీవుడ్లో చాలా మంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: