
అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను పాలన చేపట్టగానే వెనువెంటనే అమలు చేస్తే సహజంగా ప్రజల్లో మంచి స్పందన వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా సాగదీయకుండా తన సహజశైలిలానే దూకుడు ప్రదర్శిస్తున్నారు. చక్కటి పనిచేస్తున్నారు. ఒక పక్క ప్రమాణ స్వీకారం చేస్తూనే మరో పక్క ప్రగతి భవన్ గోడలను బద్దలు కొట్టించారు. ప్రజలందరూ రావడానికి ప్రజాదర్బార్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజాదర్బార్ నిర్వహించారు. దీంతో పాటు అక్కడికి వచ్చిన ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం, కూర్చేనేందుకు బల్లలు ఏర్పాటు చేయడం వంటివి చేపట్టారు.
చక్కటి పనితీరు, ఆలోచనల్లో మార్పు తన నైజాంలో సాగిస్తున్నారు. ఇచ్చిన మాట మీద నిలబడ్డారు. ఇక రెండోరోజు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళలతంతా కూడా తమకు సంబంధించిన గుర్తింపు కార్డు చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. దీంతో వారి కళ్లలో ఆనందం వెల్లివిరిసింది.
మరోవైపు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచే హామీని కూడా అమలు చేశారు. దీంతో పేదలకు మేలు జరగనుంది. ఈ హామీలతో పాటు ఉద్యమకారులపై పెట్టిన కేసుల వివరాలను కూడా అడిగి తెప్పించుకొని వాటిని కొట్టేయాలని డీజీపీని ఆదేశించారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే చకచకా ఆలస్యం చేయకుండా ఇచ్చిన హామీలను, మాటలను అమలు చేస్తూ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఏ మాత్రం సాగదీయకుండా పని చేసుకుంటూ పోతున్న సీఎం రేవంత్ రెడ్డిని అభినందించి తీరాల్సిందే.