జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 50 రోజుల కంటే ఎక్కువ సమయం లేదు.. ఏప్రిల్ లేదా మే మొదటి వారంలో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.. ఈసారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎలాగైనా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని చాలా కసితో ఉన్నారు. అందుకే పార్టీని క్షేత్రస్థాయిలో బలపరుస్తూ టిడిపి తో పొత్తు కుదుర్చుకొని మరి 24 అసెంబ్లీ స్థానాలు 3 లోక్సభ స్థానాలు కూడా ప్రకటించారు..



అయితే తొలి జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడంతో ఈ విషయం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఈసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని అందరూ అనుకున్నారు కానీ ప్రస్తుతం రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల బరిలో పవన్ కళ్యాణ్ ఉండరని బిజెపితో పొత్తు నిమిత్తం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి అక్కడ బిజెపి పార్టీ పెద్దలను కలిసి తన కేంద్ర మంత్రి పదవి ఆఫర్ అడిగినట్లుగా టాక్ వినిపిస్తోంది.

అందుకే అసెంబ్లీ ఎన్నికలలో కాకుండా ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.. గత అసెంబ్లీ ఎన్నికలలో చాలా ఘోరమైన పరాభవాన్ని కూడా పవన్ కళ్యాణ్ చూశారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల బరి నుండి వెనకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.. సేఫ్ సైడ్ గా ఉండేందుకే లోక్సభ ఎన్నికలలో నరసాపురం సీటు నుంచి పోటీ చేసేందుకే పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ అంశం పైన ఆటో జనసైనికులు టిడిపి కార్యకర్తలు కూడా చాలా గందరగోళానికి గురవుతున్నారు.. మరి పవన్ కళ్యాణ్ దారెటో అనే విషయం పైన క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: