ఏపీలో ది మోస్ట్ ఎంటర్ టైన్ మెంట్.. లేక హాట్ టాపిక్ అంశం ఏదైనా ఉందా అంటే అది సీఎం జగన్ పై జరిగిన రాయి దాడే. పైగా దాడికి పాల్పడిన కేసులో టీడీపీ కార్యకర్త పేరు తెరపైకి రావడంతో ఇది మరింత చర్చనీయాంశం అయింది. దీంతో ఈ రాయి దాడి రాజకీయంగా కలకలం రేగింది. ఈ క్రమంలో ఇది గులకరాయి దాడని విపక్షాలు ఎద్దేవా చేస్తుంటే.. అది హత్యాయత్నం కిందకి వస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. దాడి ఏదైనా ఖండించాల్సిందే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం హక్కు. కానీ భౌతిక దాడులకు పాల్పడకూడదు అని నొక్కి చెబుతున్నారు. ఇది ఏ మాత్రం ఆహ్వానించ సంస్కృతి కాదని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా జగన్ పై దాడులు ఇక్కడితో ఆగిపోతాయా.. ఆయన ప్రాణాలకు ఏ ప్రమాదం లేదా అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది.


తాజాగా ఆయనకు మరిన్ని దాడులు చేస్తాం అని బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో వైసీపీ నాయకులు భయాందోళనకు గురవుతున్నారు.  టీడీపీ అధినేత సూపర్ సిక్స్ అంటూ ఏడాది నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు. అదే విధంగా ఆయన ప్రతి సభలో కొత్త హామీల వర్షం కురిపిస్తున్నారు. కానీ ప్రజల్లోకి అంతగా వెళ్లడం లేదు. ఈ పథకాల గురించి ఎక్కడా పెద్ద చర్చ జరగడం లేదు.


ఎందుకంటే చంద్రబాబు హామీలు మాత్రమే ఇస్తారు. వాటిని అమలు చేయరు అనే అపవాదు ఉంది. పైగా గడిచిన ఐదేళ్లలో సీఎం జగన్ చెప్పిన హమీలు అన్నీ చేసి చూపించారు. దీంతో ప్రజలు జగన్ ని నమ్మినంత చంద్రబాబుని విశ్వసించడం లేదు. దీంతో ఆయనపై విరక్తి  కలిగించాలనే ఉద్దేశంతో టీడీపీ నేతలు రాళ్ల దాడి చేయిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ను అడ్డు తొలగించేందుకు ఎంతకైనా తెగిస్తారు అని వైసీపీ నాయకులు భయాందోళనకు గురవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: