ఏపీ అసెంబ్లీ సమావేశాలలో గత ఐదేళ్లలో వైసీపీ హవా నడిచింది. వైసీపీ నుంచి ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో ప్రతి సమావేశంలో వాళ్లదే పైచేయిగా నిలిచింది. అసెంబ్లీ సమావేశాల సమయంలో అప్పట్లో టీడీపీ నేతలు నిరసనలు వ్యక్తం చేయడం తెలిసిందే. అయితే రాబోయే రోజుల్లో జరిగే అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది.
 
గతంలో వైసీపీ నుంచి ఎంపీగా విజయం సాధించిన రఘురామ కృష్ణంరాజు ఈ ఎన్నికల్లో ఉండి నుంచి కూటమి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. భారీ మెజార్టీతో రఘురామ కృష్ణంరాజు గెలిచారు. అసెంబ్లీలో జగన్ స్పీచ్ కు రఘురామ కృష్ణంరాజు కౌంటర్లు ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో ఈ కాంబినేషన్ వేరే లెవెల్ లో ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
రఘురామ కృష్ణంరాజు ఎన్నికల ఫలితాల తర్వాత ఒకింత సైలెంట్ గానే ఉన్నారు. అయితే సమయం, సందర్భం వస్తే వైసీపీపై ఘాటుగా విమర్శలు చేసే విషయంలో రఘురామకు ఎవరూ సాటిరారు. గతంలో ఆయన వైసీపీ ఎంపీ కావడంతో ఆయన విమర్శలకు మీడియా కూడా ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తోంది. రఘురామ విమర్శలకు జగన్ ఎలా రియాక్ట్ అవుతారనే చర్చ సైతం జరుగుతోంది.
 
రఘురామ కృష్ణంరాజు వైసీపీకి వచ్చిన ఫలితాల విషయం లో చాలా హ్యాపీగా ఉన్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారమే ఎట్టకేలకు నిజమైంది. గోదావరి ఓటర్లు పవన్ పై అభిమానంతో అన్ని స్థానాల్లో కూటమిని గెలిపించుకున్నారు. రఘురామ కృష్ణంరాజు వైసీపీ ఎమ్మెల్యేలకు సైతం చుక్కలు చూపించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడెప్పుడు మొదలవుతాయా అని కూటమి అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాలిటిక్స్ విషయంలో రఘురామ సరైన దారిలో అడుగులు వేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: