ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... వైసిపి నేతల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఒకరి తర్వాత మరొకరు అరెస్ట్ అవుతూనే ఉన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు.. కాస్త ఓవర్ చేసిన నాయకులు అందరిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం బొక్కలో వేస్తోంది. గతంలో.... వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా.. టిడిపి నేతలను.. అరెస్టు చేయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం హవా నడుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఏపీలో మరో కీలక అరెస్ట్ జరిగింది.

 ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో వ్యక్తి అరెస్టయ్యారు. సజ్జల శ్రీధర్ రెడ్డిని... ఏపీ లిక్కర్ స్కాం లో... ఏపీ సిట్ అధికారులు అరెస్టు చేయడం జరిగింది.  లిక్కర్ స్కాం లో ఏ సిక్స్ గా ఉన్నారు సజ్జల శ్రీధర్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే.. శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాదులో ఉన్న శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. హైదరాబాదు నుంచి అర్ధరాత్రి విజయవాడకు తరలించారు. ఇక ఇవాళ శ్రీధర్ రెడ్డి ని ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరు పరచబోతున్నారు.

 ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు అధికారులు. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ లో... ఎంపీ మిథున్ రెడ్డి తో పాటు చాలామంది విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కసిరెడ్డి ఆయన అనుచరుడు కూడా అరెస్టు అయ్యారు. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డిని కూడా మొన్న ఏపీ సిట్ అధికారులు విచారణ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 9 గంటల పాటు  వైసిపి పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈ కేసులో విచారణ చేశారు అధికారులు.

 ఈ సందర్భంగా కీలక సమాచారాన్ని సేకరించి ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్నారు.  అటు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హస్తం కూడా ఇందులో ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఆయనకు కూడా నోటీసులు జారీ చేసి మొన్న విచారణ కూడా చేశారు. కానీ విజయసాయిరెడ్డి చాలా తెలివిగా తనకేమీ తెలియదు అంటూ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి.. వైసీపీ పార్టీ నేతలపై భారం వేస్తున్నారు. తాను ఒక్క రూపాయి తినలేదని... తనకు అవకాశం ఇస్తే ఈ కేసులో ఎవరెవరున్నారు అందరి పేర్లు చెబుతానని కూడా ఆయన వెల్లడిస్తున్నారు. దీంతో ఏపీ లిక్కర్ స్కాం కేసు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: