
మన భారత్ క్రికెటర్లు సైతం గర్వంగా భారత్ ఆర్మీ ని పొగిడేస్తూ పోస్టులు చేయక పాకిస్తాన్ క్రికెటర్ల పరిస్థితి చాలా దయనీయస్థితిలో పెట్టినట్లు కనిపిస్తోంది. యుద్ధం పేరు వింటేనే భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆల్రౌండర్ హసన్ అలీ తన ఇంస్టాగ్రామ్ లో యుద్ధం పరిష్కారము కాదు శాంతియుతమే పరిష్కారం అంటూ .. మేము శాంతిని కోరుకుంటున్నామంటూ తెలియజేశారు.
అలాగే పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ సోహైల్ తన్వీర్ భార్య తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని షేర్ చేస్తూ యుద్ధం అమాయక పౌరుల ప్రాణాలను తీస్తుందని.. ఓ అల్లా పాకిస్తాను, ప్రజలను సైనికులను రక్షించు అంటూ రాసుకుంది.
ఇక మాజీ బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ ఉమార్ అక్మల్ తన సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ సైన్యం జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం జరిగింది.
పాకిస్తాన్ పైన భారత్ ప్రతికార ప్రభావం చాలా క్లియర్ గా కనిపిస్తున్నది.. పిఓకే లో ఉగ్రవాద స్థావరాల పైన కూడా దాడులు జరిగాయి. ఈ దాడి ఒక్కసారిగా అక్కడ పాకిస్తాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఏప్రిల్ 22న పహాల్గామాలో జరిగిన ఉగ్రదాడికి దీటుగానే ఇండియన్ ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. కాశ్మీర్లో పహల్గాం లో 28 మంది పర్యటకులను ఉగ్రవాదులు చంపారు ఈ సంఘటన తర్వాత భారతదేశ మంత్ర కూడా ఆగ్రహంతో చెలరేగిపోయింది.. అందుకు ప్రతిస్పందనే ఈ ఆపరేషన్ సింధూర్.