వైసీపీ పార్టీలో సీనియర్ నేతగా మాజీ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భూముల వ్యవహారంలో పలు రకాల ఆరోపణలు వినిపించాయి. చిత్తూరు జిల్లాలో అటవీ, ప్రభుత్వ, బుగ్గ మఠం భూములను సైతం ఆక్రమించారనే విధంగా ఆరోపణలు వినిపించాయి.. ప్రభుత్వం చేపట్టినటువంటి విచారణలో కూడా ఈ ఆరోపణలు నిజమయ్యాయని పెద్దిరెడ్డి కుటుంబం పైన క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ అధికారులు తెలియజేస్తున్నారు. పెద్దిరెడ్డి వంటి వారికి సహాయం చేసిన సిబ్బంది పైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది ఏపీ ప్రభుత్వం.


అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లాగా పలు కీలకమైన ఆదేశాలను జారీ చేశారట. అక్రమ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పైన కేసు నమోదు చేయాలంటూ పవన్ కళ్యాణ్ ఉత్తర్వులను కూడా ఆదేశించారనే విధంగా వినిపిస్తున్నాయి. భూములను రక్షించలేని అధికారుల పైన కూడా తగు చర్యలు తీసుకోవాలని వారి పైన కూడా క్రిమినల్ కేసులో నమోదు చేయాలంటూ పవన్ కళ్యాణ్ ఆదేశాలను జారీ చేసినట్లుగా తెలుస్తోంది.


భూముల అక్రమాల పైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ DG ఇచ్చినటువంటి నివేదికను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలను కూడా జారీ చేశారట. భూములు ఆక్రమించిన వారందరి పైన క్రిమినల్ కేసులు, అలాగే అటవీ శాఖకు సంబంధించిన కేసులలో నమోదు చేయాలని తెలిపారట. నిన్నటి రోజున అధికారులు సైతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందుకు సంబంధించిన ఫైల్స్ లను కూడా అందజేశారట. మరి తన మీద వచ్చినటువంటి  భూ అక్రమాల వ్యవహారం గురించి ఏ విధంగా పెద్దిరెడ్డి , పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు  ఎలా స్పందిస్తారో చూడాలి మరి. అయితే గతంలో ఈ విషయాలను పెద్దిరెడ్డి కొట్టిపారేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: