
అయితే ఇప్పుడు 910 కిలోమీటర్లు విస్తరించబోతున్నారట. పనులు మొదలవ్వని రోడ్లను ప్రాజెక్టు నుంచి తప్పించి మరి.. తొలి దశగా రూ .3014 కోట్ల రూపాయలు అనుకున్నప్పటికీ అందులో..1761 కోట్ల రూపాయలను తగ్గించారట.. గతంలో 71 కిలోమీటర్ల పనులను చేసిన నేపథ్యంలో మిగిలిన 839 కిలోమీటర్లను పూర్తి చేసేందుకు ప్రస్తుతం పనులు చేస్తున్నారట. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులతో రోడ్లని వేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు. ఏవైతే రూరల్ ని ,అర్బన్ ని లింకప్ చేస్తూ ఈ రోడ్లను కలుపుబోతున్నారట. మొత్తానికి రోడ్ల విషయంలో కూడా ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ ని తెలియజేసింది.
అయితే ఇప్పటికే రోడ్లకి గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ఎప్పుడో మొదలు పెట్టింది.. కాని మరికొన్ని చోట్ల రోడ్లు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి. మరి ఇలాంటి సమయాలలో రోడ్లను వేయడానికి ప్రభుత్వం సిద్ధమయ్యింది. అయితే ఇదంతా కూడా కూటమిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ ప్రభుత్వం డబ్బులను రాబట్టి మరి రోడ్లు వేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి జూన్ 12వ తేదీన ఫిక్స్ చేసుకున్నారు. ఆ రోజు నుంచి అన్ని పథకాలను మొదలుపెట్టేలా ప్లాన్ చేశారు.