
అనంతరం దాదాపు గంట పాటు ఈ ఇద్దరు మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై చర్చ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీళ్ళిద్దరి సమావేశం నేపథ్యంలో.. ఓ కొత్త చర్చ తెరపైకి వచ్చింది. త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి బండ్ల గణేష్ వెళ్తాడని ప్రచారం జోరు అందుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న బండ్ల గణేష్ మొదటి నుంచి చంద్రబాబు నాయుడు ను పొగుడుతూ.. పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా నేరుగా చంద్రబాబు నాయుడును , బండ్ల గణేష్ కలిశారు. దీంతో నిజంగానే తెలుగుదేశం పార్టీలోకి బండ్ల గణేష్ వెళ్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇది ఇలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్న బండ్ల గణేష్ అప్పుడప్పుడు సినిమాల్లో నటుడిగా కూడా కొనసాగుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న బండ్ల గణేష్ అప్పట్లో కేసీఆర్ను మెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కేసీఆర్ ను బండ బూతులు తిట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి జపం చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు చెంతకు చేరారు బండ్ల గణేష్.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు