తెలుగుదేశం పార్టీ ప‌సుపు పండుగ మ‌హానాడు అట్ట‌హాసంగా ప్రారంభమైంది. క‌డ‌ప‌లో అంబ‌రాన్నంటే సంబ‌రాల మ‌ధ్య‌ ఈ వేడుక‌లు మూడు రోజుల పాటు నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం అభిమానులు క‌డ‌ప వైపు వెళుతున్నారు. ఏపీకి సంబంధిం చిన అంశాల‌పై తొలిరోజు ప్ర‌స్తావించారు. ఇదిలా ఉంటే తాజా మ‌హానాడుకు తెలంగాణ నుంచి 30 మంది కీల‌క నాయ‌కులు వ‌చ్చారు. తెలంగాణ‌లోనూ టీడీపీని పుంజుకునేలా చేస్తామ‌ని .. త్వ‌ర‌లోనే అక్క‌డ పార్టీ అధ్య‌క్షుడి తో పాటు ఇత‌ర క‌మిటీని కూడా నియ‌మిస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. సీఎంగా గ‌తేడాది చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం చేశాక .. తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన‌ప్పుడు కూడా ఈ విష‌యాన్ని చెప్పారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటి ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌లేదు.


ఇక తెలంగాణ‌లో బీసీ నాయ‌కుడికే పార్టీ పీఠాన్ని అప్ప‌గించాల‌న్ని డిమాండ్లు ఉన్నాయి. గ‌తంలో ఆర్ కృష్ణ‌య్య‌ను బీసీ కోటాలో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఉన్న‌ కాసాని జ్ఞానేశ్వ‌ర్‌కు తెలంగాణ బీసీ అధ్య‌క్షుడి ప‌గ్గాలు ఇచ్చి చేతులు కాల్చుకున్నారు. అయితే పార్టీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోవ‌డంతో ఆయ‌న దానిని నిరిస్తూ పార్టీ మారి బీఆర్ ఎస్ కండువా క‌ప్పేసుకున్నారు. అప్ప‌టి నుంచి కూడా తెలంగాణ టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఖాళీగా ఉంది. అయితే ఇప్పుడు మ‌హానాడు నేప‌థ్యంలో పార్టీ ప్ర‌క‌టించిన‌ 14 కీల‌క తీర్మానాల్లో మాత్రం.. తెలంగాణ అంశం కూడా ఉంది. దీంతో తెలంగాణ పార్టీలో అధ్య‌క్షుడి నియామ‌కం, ఇత‌ర స్థానాల నియామ‌కంపై చ‌ర్చిస్తార‌ని తెలంగాణ నుంచి వ‌చ్చిన నాయ‌కులు అయితే ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే చంద్ర‌బాబు నిర్ణ‌య‌మే మాకు శిరోధార్యం అని వారు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో తెలంగాణ తెలుగుదేశం విష‌యంలో ఏం జ‌రుగుతుందా ? అన్న ఆస‌క్తి అయితే ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: